Ratan Tata funeral: పార్సీ సంప్రదాయాలతో రతన్ టాటా అంత్యక్రియలు

Ratan Tata funeral: పార్సీ సంప్రదాయాలతో రతన్ టాటా అంత్యక్రియలు

టాటా గ్రూప్ చైర్మన్, బిజినెస్ లెజెండరీ రతన్ టాటా అంత్యక్రియలు గురువారం(అక్టోబర్10) సాయంత్రం ముంబైలో జరిగాయి. అధికారిక లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలు అంత్యక్రియలు నిర్వహించాయి. రతన్ టాటా అంతిమ రతన్ టాటా పార్సీ కావడంతో అతని అంత్యక్రియలు పార్సీ సంప్రదాయం ప్రకారం జరిగాయి. 

పార్సీలు.. హిందువులు, ముస్లిం వలె దహనం చేయడం గానీ, పాతిపెట్టడంగానీ చేయరు. వారు పార్థీవ దేహాన్ని ప్రకృతికి బహుమతిగా ఇస్తారు. దహనం చేయడం లేదా పూడ్చిపెట్టడం ప్రకృతి మూకాలైన నీరు, గాలి, అగ్నిని కలుషితం చేస్తాయని జోరాస్ట్రియన్లు నమ్ముతారు. 

పార్సీ సంప్రదాయంలో అంత్యక్రియలు ఇలా.. 

పార్థీవ దేహాన్ని కడిగి, పార్సీ సాంప్రదాయ దుస్తులైన సుద్రే, కుస్తి అని పిలువబడే తెల్లటి కవచంతో చుడతారు నడుము చుట్టు పవిత్ర తాడును కడతారు. మృతదేహాన్ని అంతిమ యాత్ర తీసుకెళ్లేముందు పార్సీ పూజూరులు ప్రార్థనలు , ఆశీర్వాదాలు నిర్వహిస్తారు. 

Also Read:-అశ్రునయనాల నడుమ ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

మరణించిన వ్యక్తి ఆత్మ మరణాంతర జీవితంలోకి సజావుగా మారడానికి ఈ ఆచారాలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తరలివస్తారు. అనంతరం దఖ్మా అనే టవర్ ఆఫ్ సైలెన్స్ వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్తారు. పార్థివ దేహాన్ని దఖ్మాపై ఉంచుతారు. అక్కడ రాబందువులకు అందుబాటులో ఉంటుంది. 

అయితే రాబందుల జనాభా తగ్గిపోవడం కాలలానుగుణంగా వస్తున్న మార్పుల్తో పార్సీలు ఈ సంప్రదాయానికి బదులుగా ఎలక్ట్రిక్ దహన సంస్కారాలకు ప్రాధాన్యత నిస్తున్నారు. కొన్ని చోట్ల సౌరకేంద్రీకరణలను వినియోగిస్తున్నారు.