రతన్ టాటా మానవత్వానికి మచ్చు తునక : తాజ్ పై ఉగ్రదాడి తర్వాత స్పందించిన తీరుకు హ్యాట్సాఫ్

రతన్ టాటా మానవత్వానికి మచ్చు తునక : తాజ్ పై ఉగ్రదాడి తర్వాత స్పందించిన తీరుకు హ్యాట్సాఫ్

అది 2008వ సంవత్సరం.. నవంబర్ 26వ తేదీ.. ముంబైపై ఉగ్రవాదుల దాడి.. ముంబై సిటీలోని తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల కిరాతకం.. ఆ సమయంలో టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా వ్యవహరించిన తీరు.. ఆ తర్వాత స్పందించిన తీరుకు దేశమే హ్యాట్సాఫ్ చెప్పింది.. 60 గంటల తాజ్ ఆపరేషన్ లో భాగంగా.. ఆయన ఇంట్లో ఉండలేదు.. హోటల్ బయటే భద్రతా దళాలతో కలిసి పని చేశారు. హోటల్ లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత నాదే అని.. వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత నాదే అంటూ ప్రకటించారు రతన్ టాటా.. 

ముంబై తాజ్ హోటల్ పై ఉగ్రదాడి తర్వాత రతన్ టాటా చేసిన సాయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ దాడిలో టాటా కంపెనీ ఉద్యోగులతో పాటు ఆ హోటల్ లో బస చేసేందుకు వచ్చిన పర్యాటకులు గాయపడ్డారు. ముంబై ఉగ్రదాడిలో చనిపోయిన మొత్తం 166 మందిలో.. 33 మంది తాజ్ హోటల్ లోనే చనిపోయారు. ఈ 33 మందిలో 11 మంది హోటల్ ఉద్యోగులు ఉన్నారు.

ALSO READ | Ratan Tata: రతన్ టాటా ప్రస్థానం: 10వేల కోట్ల నుండి లక్ష కోట్ల దాకా

ఉగ్రదాడి తర్వాత టాటా హోటల్ క్లోజ్ అవుతుందని చాలా మంది భయపడ్డారు. రతన్ టాటా అలా చేయలేదు. హోటల్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు.. ఉద్యోగులకు మరింత భరోసా ఇచ్చారు. ఉగ్రదాడిలో మరణించిన తాజ్ ఉద్యోగుల ఫ్యామిలీకి.. చనిపోయిన ఉద్యోగి తన జీవిత కాలం మొత్తం.. అంటే రిటైర్ మెంట్ అయిన 60 సంవత్సరాల వరకు.. ఎంత అయితే సంపాదిస్తాడో.. అంత మొత్తాన్ని బాధిత కుటుంబానికి వెంటనే అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారు. 

ఉగ్రదాడి జరిగిన రెండు వారాల్లోనే తాజ్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి.. బాధిత కుటుంబాలను నెల రోజుల్లోనే ఆదుకున్నారు రతన్ టాటా. టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా.. ఉగ్ర దాడిలో చనిపోయిన  ప్రతి ఒక్కరి ఇంటికి స్వయంగా వెళ్లి.. మొత్తం సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం అందర్నీ  ఆదుకున్నారు. 

2008లోనే.. ఒక్కో బాధిత ఉద్యోగి కుటుంబానికి రూ.36 లక్షలు నుంచి 85 లక్షల రూపాయల వరకు సాయం చేశారు. ఒకేసారి నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా.. చనిపోయిన ఉద్యోగి సర్వీస్ ప్రకారం.. వారి రిటైర్మెంట్ వయస్సు వరకు.. ప్రతి నెలా కొంత జీతాన్ని అతని కుటుంబానికి ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు రతన్ టాటా. బాధిత కుటుంబాల పిల్లల చదువుకు అయ్యే ఖర్చుని కూడా.. టాటా ట్రస్ట్ నుంచి అందించే విధంగా చూశారు. తాజ్ హోటల్ లో గాయపడిన తాజ్ ఉద్యోగులను హాస్పిటల్ కి వెళ్లి స్వయంగా పరామర్శించటమే కాకుండా.. వారి వైద్య ఖర్చులు మొత్తాన్ని చెల్లించారు రతన్ టాటా. పూర్తిగా కోలుకుని మళ్లీ విధులకు హాజరయ్యే వరకు పూర్తి జీతంతోపాటు.. అదనంగా మరో 50 శాతాన్ని కూడా చెల్లించారు రతన్ టాటా. 

అప్పుడే కాదు.. ఇప్పటికి కూడా ఇదే హిస్టరీ కావటం విశేషం.. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా తన ఉద్యోగులను ఈ విధంగా ఆదుకున్నది లేదు అనేది రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో రతన్ టాటా తన ఉద్యోగులను ఆదుకున్న తీరు.. మానవత్వానికే మచ్చుతునక.. అందుకే రతన్ టాటాను ఆ కంపెనీ ఉద్యోగులు ఉంటారు.. గాడ్ ఆఫ్ చైర్మన్ అని.. గాడ్ ఆఫ్ భారత్ అని..