భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. గొప్ప గొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి సక్సెస్ అయిన విలువలు కలిగిన వ్యాపారవేత్త, దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలని నిత్యం తపించే మనీషి రతన్ టాటా .. లవ్ (ఫెయిల్యూర్) స్టోరీ గురించి తెలుసుకుందాం. . .
ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata). ఆయన హయాంలో టాటా కంపెనీ సూపర్ సక్సెసర్‌గా నిలిచింది. నష్టాల్లో ఉన్న కంపెనీలను సైతం కొనుగోలు చేసి లాభాలబాట పట్టించిన ఘనత ఆయనది. గొప్ప మానవతావాదిగా, వ్యాపారవేత్తగా రాణించిన ఆయన వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉన్నాయి.
Also Read :- రతన్ టాటా .. వ్యాపార దిగ్గజం... యువకులకు స్ఫూర్తి..
వ్యాపారంలో ఎన్నో మైలురాళ్లు సంపాదించిన రతన్ టాటాకు ఓ లవ్ స్టోరీ ఉన్నది. ఆయన ప్రేమకథ ఫెయిల్యూర్ కావడంతో టాటా వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. రతన్ టాటా అమెరికాలో ఓ యువతిని ప్రేమించారు.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితుల రీత్యా భారత్‌కు రావలసి వచ్చింది. ఆ సమయంలో భారత్ – చైనా మధ్య యుద్ధం జరుగుతున్నది. ఈ కారణంగా ఆమెను భారత్ పంపేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో వారి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరకుండా మధ్యలోనే ముగిసింది. దీంతో ఆయన ఒంటరి జీవితం గడిపారు. తరువాత కూడా చాలా మంది అమ్మాయిలతో ప్రేమ పడిన ఆయన పనుల్లో బిజీగా ఉండటంతో ఉండడంతో వివాహం వరకు వెళ్లలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తాను పెళ్లి చేసుకోకపోవడానికి బిజినెస్ పనుల్లో ఎంతో బిజీగా ఉండటం.. సరైన సమయం దొరకకపోవడం కూడా ఒక కారణమన్నారు. వ్యాపారరంగంలో సూపర్ సక్సెస్‌గా నిలిచిన అనంతరం చాలా సమయాల్లో పెళ్లి ఆలోచన వచ్చినా.. కుటుంబానికి సరైన సమయం కేటాయించలేమోననే భయం వేసేదని.. ఈ క్రమంలో పెల్లి చేసుకునేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత దూరంగా ఉన్నట్లు వివరించారు. దీంతోఆయన సింగిల్ గానే లైఫ్ లీడ్ చేశారు.