రతన్ జీ చెప్పిన గోల్డెన్ వర్డ్స్ : సక్సెస్ కావాలంటే ఒక్కసారైనా ఇవి చదవాల్సిందే

రతన్ జీ చెప్పిన గోల్డెన్ వర్డ్స్ : సక్సెస్ కావాలంటే ఒక్కసారైనా ఇవి చదవాల్సిందే

బిజినెస్ టైకూన్ రతన్ టాటా ఇకలేరు. వ్యాపారవేత్త అయిన ఆయన దానధర్మాల్లో కర్ణుడి లాంటి వాడు. దేశాన్ని ప్రేమించడంతో అందరికంటే ముందుండే వ్యక్తి. తరతరాలుగా భారతదేశ వ్యాపారం రంగంలో వారి కుటుంబానికంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది.  టాటా ఉప్పు.. ఇది మన దేశం ఉప్పు.. అంటూ కూరలో వాడే ఉప్పు నుంచి.. నిర్మాణ రంగంలొ వాడే ఉక్కు వరకు అన్ని ఉత్పత్తులు తయారు చేస్తూ.. కోట్ల మందికి ఉపాది కల్పిస్తున్న పెద్ద వ్యాపార సంస్థ టాటా. రతన్ టాటా జీవిత అనుభవాలోంచి యువతకు ఎన్నో మంచి మాటలు చెప్పారు. లైఫ్ లో విజయం సాదించాలంటే ఆ మాటలకు వింటే చాలా ఇన్స్‌ప్రేషన్ గా ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు ఒక్కో మాట ఒక్కో డైమండ్ గా ఎంతో మంది జీవితాలకు దగ్గరగా ఉంటాయి. వాటన్నింటినీ ఒకేచోట ఇప్పుడు చూద్దాం..

  • ఎవరూ ఇనుమును నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే ఇనుమును నాశనం చేస్తుంది.. అలాగే ఎవరూ కూడా ఒక వ్యక్తిని నాశనం చేయలేరు.. వారి ఆలోచనా విధానమే వాళ్లను నాశనం చేస్తుంది..!
  • ప్రజలు మీపై విసిరే రాళ్లను తీసుకోండి.. ఆ రాళ్లతో స్మారక చిహ్నం ఏర్పాటు చేసుకోండి..!
  • సరైన నిర్ణయాలు తీసుకోవడం అనే దానిపై నాకు నమ్మకం లేదు. నేను నిర్ణయాలు తీసుకుని.. వాటిని వాటిని సరిచేస్తాను.
  • నేను ఎగరలేని రోజు ఉంది అంటే..  నాకు ఆ రోజు విచారకరమైన రోజునే..
  • నా భావోద్వేగాలను ప్రపంచానికి చూపించడమే.. నేను చేసిన బలమైన పని.
  • మనం జీవితంలో ఎదగాలంటే అప్ అండ్ డౌన్స్ ఉండాల్సిందే.. అలా కాకుండా ECGలో బారుగీత వచ్చిందంటే.. మన బతికి ఉన్నట్లు కాదు కదా..
  • భవిష్యత్ ఏంటో నాకు తెలియదు.. ఎలా ఉంటుందో కూడా తెలియదు.. రాబోయే రోజుల్లో నేను ఆశ్చర్యానికి గురి కావటం మాత్రం ఖాయం.. 
  • మీరు వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవండి... అలా కాకుండా.. మీరు చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం మిగతా వారితో కలిసి నడవండి
  • ఓటమికి భయపడకపోవడమే.. గెలవడానికి ఏకైక మార్గం."
  • ప్రయత్నించకపోవడమే గొప్ప వైఫల్యం.. ప్రయత్నించకుండా ఏదీ సాధించలేరు.. జీవితంలో దేన్నీ గెలవలేరు..
  •  మన జీవితాన్ని అదృష్టానికి వదిలేయం అనేది మూర్ఖత్వం.. నేను హార్డ్ వర్క్.. ప్రిపరేషన్‌ను మాత్రమే నమ్ముతాను.
  • ఎప్పుడూ హ్యాపీగా ఉండకపోవచ్చు.. జాలీగా ఉండకపోవచ్చు.. అన్ని సమస్యలను పరిష్కరించలేక పోవచ్చు.. అలా అని మీకు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు.. ఎందుకంటే ధైర్యం అనేది అంటువ్యాధి లాంటిది.. ఆ దైర్యాన్ని సొంత జీవితానికి తీసుకోండి.. 
  •  
  • ఇతరుల ప్రవర్తన.. మీ మనశ్సాంతిని నాశనం అయ్యే విధంగా ఆలోచించవద్దు.. 
  • మీ మూలాలను ఎప్పటికీ మరచిపోకండి.. మీరు ఎక్కడ నుంచి వచ్చారో ఎల్లప్పుడూ గుర్తించుకోండి.. గర్వపడండి.. అంతేకానీ గతాన్ని మర్చిపోతే భవిష్యత్ గుణపాఠం చెబుతోంది.
  • విజయం, గెలుపు అనేవి గమ్యం కాదు.. అది జస్ట్ జర్నీ మాత్రమే.. ప్రయాణంలో ఓ భాగం అని గుర్తుంచుకోండి..
  • ఇది ఆలోచనల గురించి కాదు.. ఆలోచనలు జరిగేలా చేయడం గురించి."
  • కఠినమైన మార్గం అయినప్పటికీ.. మీ విలువలు. సిద్ధాంతాలపై ఎప్పుడూ రాజీ పడకండి.. రాజీపడటం, ఆధారపడటం మొదలైతే.. మీరు జీవితంలో గెలిచినట్లు కాదు..
  • ఒక ఆలోచన విలువ.. దానిని ఉపయోగించడంలో ఉంటుంది.. ప్రారంభంలో కష్టాలు వచ్చినా వెన్నుచూపొద్దు. లక్ష్యం గురి పెట్టాలి.
  • నాయకత్వం అంటే ఇన్‌ఛార్జ్‌గా ఉండటం కాదు.. మీ కింద పని చేసే వారిని జాగ్రత్తగా.. బాధ్యతగా చూసుకోవడం అనేది గుర్తించుకోవాలి.
  • మీరు యుద్ధంలో గెలవడానికి ఒకటి కంటే ఎక్కువసార్లు పోరాడవలసి ఉంటుంది... గెలుపు అనేది ఒక్క యుద్ధంలోనే రాదు.. 
  • మీరు కలతో ప్రారంభించి.. అభిరుచితో ఆ పని చేసినప్పుడు.. విజయం కచ్చితంగా వరిస్తుంది.. అందులో సందేహం లేదు.
  • ఔదార్యం, దయ, క్షమా గుణం అనేవి ఒక నాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణాలు, అవి బలహీనత కాదు.. బలం..
  • అతిపెద్ద రిస్క్ ఏంటీ అంటే.. ఏ రిస్క్ తీసుకోకపోవడం.. వేగంగా మారుతున్న కాలంతో పోటీ పడాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే.. రిస్క్ లేకపోతే విజయం లేదు..
  • మనం ఆ దేవుని బిడ్డలం..ఈ భూమిపై ఇక్కడ ఉండటానికి మాత్రమే వచ్చాం.. ఎప్పటికైనా పైకి పోవాల్సిన వాళ్లమే.. ఈ విషయాన్ని మర్చిపోవద్దు.
  •  భారతదేశ భవిష్యత్తు గురించి నేను ఎప్పుడూ చాలా నమ్మకంగా.. ఉల్లాసంగా ఉంటాను.. ఆలోచిస్తాను..
  • నా కోసం నేను ఏమీ చేయలేని రోజు ఒకటి ఉంది అంటే.. ఆ రోజు నా బ్యాగ్‌లు సర్దుకుని బయలుదేరే రోజు."
  •  నాయకత్వం అంటే బాధ్యత తీసుకోవడంజ.. సాకులు చెప్పడం కాదు... తప్పించుకోవటం అంతకన్నా కాదు..
  •  
  • నేను స్వల్పకాలిక లక్ష్యాలను నమ్మను. నేను దీర్ఘకాలిక లక్ష్యాలపైనే దృష్టి పెడతాను.. అదే అన్నింటికీ మంచిది.
  • విజయాన్ని మీ తలపైకి రానివ్వవద్దు.. వైఫల్యాన్ని మీ హృదయంలో చొటు కల్పించొద్దు.
  • నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు. ఎదగడానికి.. అభివృద్ధి చెందడానికి మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి.
  • మీ వైఖరి.. మీ అహంకారం కాకూడదు..  
  • గెలిచినప్పుడు వినయంగా ఉండండి.. ఓడినప్పుడు దయతో ఉండండి.. కాలం అన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది.
  • అవకాశాల కోసం వేచి ఉండకండి.. అవకాశాలను సృష్టించుకోవటానికి ప్రయత్నాలు చేయండి.. 
  • విజయం చివరిది కాదు.. ఓటమి చావు కాదు.. కొనసాగించాలనే ధైర్యం ముఖ్యం..
  • నిజాయితీ ఉన్న వ్యక్తిగా ఉండండి.. కష్టాలు చుట్టుముట్టినప్పుడు కూడా విలువను తగ్గించుకోవద్దు.. నిజాయితీ వదిలేయొద్దు.
  • వైఫల్యానికి భయపడవద్దు, ఎందుకంటే ఇది విజయానికి సోపానం...
  • సవాళ్లను ఎదుర్కోవడంలో పట్టుదలగా.. దృఢంగా ఉండండి, ఎందుకంటే అవి విజయానికి బిల్డింగ్ బ్లాక్స్...
  • విజయం అనేది ఉత్తమంగా ఉండటం కాదు, మిమ్మల్ని ఉత్తమ సంస్కరణ వాదిగా చూపించటానికి అని గుర్తించుకోండి.
  • గొప్ప నాయకులు అంటే ఇతరులను గొప్పగా మార్చడానికి ప్రేరేపించేవారు.. 
  • మీ కీర్తి, మీ పేరు ప్రతిష్టలే మీ అతిపెద్ద ఆస్తి.. దానిని జాగ్రత్తగా కాపాడుకోండి.
  • జీవితం అంటే మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం కాదు..మిమ్మల్ని మీరు సృష్టించుకోవడం గురించి అని గుర్తుంచుకోండి..
  • సానుకూల మార్పును కలిగించే వారసత్వాన్ని వదిలివేయండి.. సొంత ఆలోచనలు, సృష్టించటంపై దృష్టి పెట్టండి.

Also Read :- రతన్ టాటా ఇక లేరు..