టాటా గ్రూపులో రతన్ ప్రస్థానం : అసిస్టెంట్ ఉద్యోగం నుంచి చైర్మన్ వరకు ఇలా ఎదిగారు

టాటా గ్రూపులో రతన్ ప్రస్థానం : అసిస్టెంట్ ఉద్యోగం నుంచి చైర్మన్ వరకు ఇలా ఎదిగారు

రతన్​ టాటా  ఈయన పేరు తెలియని వారు ప్రపంచంలో దాదాపు ఎవరూ ఉండరు.  86 ఏళ్ల రతన్​...   వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతూ  బుధవారం ( అక్టోబర్​ 9)  రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో భారత వ్యాపార ప్రపంచం ఓ కీలకమైన వ్యక్తిని పోగొట్టుకుంది.  టాటా అంటే గుండు సూది  నుంచి విమానాల వరకు...  ఉప్పు  నుంచి సాఫ్ట్ వేర్ వరకూ విస్తరించిన ఒక మహా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. 

రతన్ టాటా 1962లో టాటా గ్రూప్‌లో టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు.   కెరీర్ ప్రారంభంలో అనుభవం లేని కారణంగా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. టాటా గ్రూప్ పగ్గాలను చేపట్టిన తరువాత  65శాతం ఆదాయాన్ని  విదేశాల నుంచి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆయన ప్లాన్​ సక్సెస్​ కావడంతో  కంపెనీ గ్రూపు ఆదాయం 40 రెట్లు పెరిగింది. తరువాత  కంపెనీ లాభాలు 50 రెట్లు పెరిగాయి. ఇందులో లండన్‌కు చెందిన టెట్లీ టీని 431.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

రతన్ టాటా వ్యూహాలతో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలను  టాటా గ్రూప్  కొనుగోళ్లు చేసింది. దాదాపు 100 దేశాలకు పైగా టాటా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. టాటా టీ ద్వారా టెట్లీ, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా స్టీల్ ద్వారా కోరస్‌తో సహా ఈ కొనుగోళ్లు టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేశాయి. దక్షిణ కొరియాకు చెందిన డేవూ మోటార్స్ ట్రక్కుల తయారీ యూనిట్‌ను 102 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆంగ్లో-డచ్ కంపెనీ కోరస్ గ్రూప్‌ను 11.3 బిలియన్ డాలర్లకు స్వాధీనం చేసుకుంది. భారతీయ పారిశ్రామిక రంగంలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. 

1868లో ఒక చిన్న వస్త్ర, వ్యాపార సంస్థగా ప్రారంభమైన టాటా గ్రూప్ నుంచి ఉప్పు, ఉక్కు, కార్ల తయారీ వరకూ వ్యాపార సంస్థలు విస్తరించాయి. తర్వాత ప్రపంచ నాయకుడిగా రూపాంతరం చెందింది సాఫ్ట్‌వేర్, పవర్ ప్లాంట్లు , విమానయాన సంస్థలలో అడుగు పెట్టింది టాటా సంస్థ. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ఎన్నో చరిత్రలు సృష్టించింది. ఈ టాటా గ్రూప్ న కు ఆదాయం, లాభాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి.

రతన్​ టాటా విజయాలు

  • 1970 :   టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో రతన్ టాటా ప్రవేశం
  • 1971 :  కష్టాల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ (నెల్కో) డైరెక్టర్ -ఇన్‌చార్జ్ గా బాధ్యతలు.. గాడిలో పెట్టిన రతన్​ టాటా
  • 1974: టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌
  • 1981:  టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్‌ గా నియామకం
  • 1983 : టాటా సాల్ట్​ తయారీ
  • 1986 నుంచి -1989 వరకు  ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా బాధ్యతలు 
  • 1991:  టాటా సన్స్, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా JRD టాటా నుండి రతన్ టాటా పగ్గాలు స్వీకరణ
  • 1998 : భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ SUV టాటా సఫారి విడుదల
  • 2000: పద్మ భూషణ్ అవార్డ్​
  • 2000: బ్రిటీష్ టీ బ్రాండ్ టెట్లీని కొనుగోలు ( టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా చేశారు)
  •  2004: TCS ఐపీవో ద్వారా చరిత్ర సృష్టించారు. 
  • 2005: టాటా కెమికల్స్ బ్రిటిష్ కంపెనీ బ్రన్నర్ మోండ్‌ని కొనుగోలు 
  • 2007: యూరోపియన్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు 
  • 2008: జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు 
  • 2008: భారతదేశంలో  టాటా నానో కారు  విడుదల 
  • 2008:  పద్మ విభూషణ్  అవార్డ్​
  •  2012:, టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగి, సైరస్ మిస్త్రీకి బాధ్యతలు
  • 2012:  టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్‌గా నియామకం
  • 2013: హైడ్రోజన్​ స్టార్​ బస్​ ప్రారంభం
  • 2015 : నానో కారు ప్రారంభం
  • 2016:  కొన్ని కారణాలతో సైరస్ మిస్త్రీ  టాటా సన్స్ ఛైర్మన్ పదవి    తప్పుకున్నారు
  • అక్టోబరు 2016 నుండి -ఫిబ్రవరి 2017వరకు: టాటా గ్రూప్‌నకు తాత్కాలిక చైర్మన్‌
  • 2017 నుండి: 30కు పైగా  స్టార్టప్‌లలో పెట్టుబడులు 
  • 2018 :  టాటా నెక్సాన్ 5-స్టార్ రేటింగ్ కారు మార్కెట్లో విడుదల
  • 2018: టీసీఎస్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ .. టాటా చైర్మన్ బాధ్యతల స్వీకరణ 
  • 2021:  స్విమ్మెస్ట్​ మెకానికల్ వాచ్ తయారీ