Ratan Tata: రతన్ టాటా ప్రస్థానం: 10వేల కోట్ల నుండి లక్ష కోట్ల దాకా

Ratan Tata: రతన్ టాటా ప్రస్థానం: 10వేల కోట్ల నుండి లక్ష కోట్ల దాకా

ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం ర‌త‌న్ టాటా మరణం భారతావనిని శోకసంద్రంలో ముంచేసింది..  ఎన్నో ల‌క్ష‌ల మందికి జీవితం ఇచ్చిన టాటా ఒక్క పారిశ్రామిక రంగంలోనే కాకుండా విద్యా, ఆరోగ్య రంగాల్లోనూ ఎనలేని సేవలందించారు. భారత ప్రబుత్వంచే ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు అందుకున్న టాటా ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. 

రతన్ టాటా పారిశ్రామిక ప్రస్థానం: 

ఉద్యోగి నుండి అధినేతగా:

1962లో టాటా స్టీల్ లో ఉద్యోగిగా చేర‌డంతో మొదలైన రతన్ టాటా ప్రస్థానం... టాటా గ్రూప్ ను 10వేల కోట్ల నుండి లక్ష కోట్ల దాగా ఎదిగేలా చేసింది. అంచెలంచెలుగా ఎదిగిన రతన్ టాటా 1991లో టాటా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. దాదాపు 20ఏళ్లకు పైగా టాటా సన్స్ గ్రూపును ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నడిపారు.

టెలీ సర్వీసెస్ నుండి టీసీఎస్ ( TCS ) గా రూపాంతరం: 

1996లో టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించిన రతన్ జీ, 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)గా మార్చి.. సాఫ్ట్ వేర్ రంగంలోనూ లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. 20ఏళ్ళ తర్వాత 2012లో టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయ్యారు.

ALSO READ | ఆయన ఒక లెజెండ్.. భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు: రతన్‌ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు

2016 అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు టాటా గ్రూప్‌ కు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారురతన్ టాటా. తర్వాత 2017లో ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చైర్మెన్ బాధ్యతలు స్వీకరించారు. సామాన్యుల సొంత కారు కలను నెరవేర్చిన వ్యాపార చాణక్యుడు రతన్ టాటా. 2009లో నానోను కేవలం లక్ష రూపాయల ఖర్చుతో రతన్‌ టాటా విడుదల చేశారు. నానో ఆవిష్కరణ రతన్ టాటా ప్రస్థానంలో మరో మైలురాయి అని చెప్పచ్చు.

టెట్లీ (2000):

బ్రిటీష్ టీ దిగ్గజం టెట్లీని 450 మిలియన్ డాలర్లకు  కొనుగోలు చేయడం రతన్ టాటా ప్రస్థానంలో మరో ల్యాండ్ మార్క్. ఇండియన్ చేసిన మొదటి అతిపెద్ద విదేశీ కొనుగోళ్లలో ఇది ఒకటి. దీని ద్వారా గ్లోబల్ బివరేజ్ మార్కెట్ లో టాటా తనదైన ముద్ర వేశారు.

కోరస్ (2007):

కోరస్‌ను 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా టాటా స్టీల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలిచింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008):

దిగ్గజ బ్రిటిష్ కార్ బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ లను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయటంతో టాటా మోటార్స్‌ గ్లోబల్ ఆటోమోటివ్ ప్లేయర్‌గా మారింది టాటా గ్రూప్. ఈ డీల్ టాటా మోటార్స్‌ను గ్లోబల్ ప్లేయర్ గా మార్చడమే కాకుండా లగ్జరీ కార్ బ్రాండ్‌లను తిరిగి మార్కెట్ లీడర్స్ గా నిలిపింది.