Ratan Tata: వంట మనిషి- సేవకులకు రూ.3.5 కోట్లు.. టాటా పెద్ద హృదయం..

Ratan Tata: వంట మనిషి- సేవకులకు రూ.3.5 కోట్లు.. టాటా పెద్ద హృదయం..

Ratan Tata Will: రతన్ టాటా ఈ పేరు వినగానే అదొక తెలియని గౌరవం. వ్యాపారవేత్తగా ఎదగటానికి తప్పుడు మార్గాలను అస్సలు ఎంచుకోకుండా నేటి తరం యువ వ్యాపారవేత్తలకు స్పూర్తిదాయకంగా నిలిచారు. అయితే బ్రతికున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఎలా తనను నమ్ముకున్న వారికి అండగా నిలవాలి అనే విషయం రతన్ టాటా జీవితాన్ని చూపి అందరూ నేర్చుకోవాలి.

అక్టోబర్ 2024లో దివంగతులైన రతన్ టాటా తన మెుత్తం ఆస్తుల్లో రూ.3.5 కోట్లను తన ఆఫీస్ స్టాఫ్, ఇంట్లోని పనివారు సేవకుల కోసం కేటాయించినట్లు వీలునామా వెల్లడించింది. ఇందుకో కుక్ నుంచి కార్ క్లీనర్, ప్యూన్ కి కూడా ప్రయోజనం చేకూరేలాగా చేశారు. అలాగే వారు తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని వీలునామాలో పొందుపరిచారు.

తనకు 7 ఏళ్లకు పైగా కాలం నుంచి సేవలు అందంచిన ఇంట్లోని సేవకులకు తన ఆస్తి నుంచి రూ.15 లక్షలను వారు పనిచేసిన సంవత్సరాలకు అనుగుణంగా పంపిణీ చేయాలని టాటా తన వీలునామాలో ఆదేశించారు. అలాగే పార్ట్‌టైమ్ సహాయకులు, కార్ క్లీనర్లకు రూ.లక్ష అందించాలని టాటా ఆదేశించారు. అలాగే  టాటా తన చిరకాల వంటవాడు రాజన్ షాకు కోటి రూపాయలు ప్రయోజనాన్ని కల్పించారు.ఇందులో రూ. 51 లక్షల రుణమాఫీ కూడా ఉంది. ఇక బట్లర్ సుబ్బయ్య కోనార్‌కు రూ. 66 లక్షలు కేటాయించగా.. ఇందులో రూ.36 లక్షల రుణమాఫీ కూడా ఉంది. సెక్రటరీ డెల్నాజ్ గిల్డర్‌కు రూ.10 లక్షలు అందేలా వీలునామాలో ఏర్పాటు చేశారు.

►ALSO READ | Ratan Tata: టాటా రూ.3వేల 800 కోట్ల వీలునామా.. ఎవరెవరికి ఏమి ఇచ్చారంటే..?

ఇదే క్రమంలో టాటాకు అత్యంత సన్నిహితంగా ఉన్న శాంతను నాయుడు ఎంబీఏ విద్య కోసం తీసుకున్న కోటి రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు టాటా వీలునామాలో పేర్కొన్నారు.  అలాగ టాటా తన డ్రైవర్ రూజు లియోన్ కు రూ.18 లక్షల రుణాన్ని మాఫీ చేస్తూ రూ.1.5 లక్షల నిధిని అందేలా ఆదేశించారు. ఇక టాటా ట్రస్ట్స్ కన్సల్టెంట్ హోషి డి మలేశరాకు రూ.5 లక్షలు, ఆలీబాగ్ బంగ్లా కేర్ టేకర్ దేవేంద్ర కటామెుల్లుకు రూ.2 లక్షలు, పర్సనల్ అసిస్టెంట్ దీప్తీ దివాకర్ కు రూ.1.5 లక్షలు వీలునామాలో కేటాయించారు.

ఇదే క్రమంలో టాటాకు చేవలు అందించిన ప్యూన్లు గోపీ సింగ్, పాండురంగ గౌరవ్ లకు రూ.50 వేల చొప్పున సహాయాన్ని అందించాలని ఆదేశించారు. అలాగే సహాయకుడిగా పనిచేసిన సఫ్రాజ్ దేష్ముఖ్ కి రూ.2 లక్షల రుణమాఫీని కూడా అందించారు.  అలాగే రతన్ టాటా తనకు ఎంతగానో ఇష్టమైన జర్మన్ షపర్డ్ కుక్క టిటోకు వీలునామాలో రూ.12 లక్షలు అందించారు. ప్రతి త్రైమాసికానికి కుక్కకు రూ.30వేలు అందేలా నిర్ణయించారు. ప్రస్తుతం రతన్ టాటా మరణం తర్వాత టిటో చిరకాల కుక్ రాజన్ షా ఇప్పుడు టిటో సంరక్షణలో కొనసాగుతోంది.