రతన్ టాటా ఎన్నో రంగాల్లో అడుగుపెట్టినట్టు సినిమా రంగంలో కూడా అడుగుపెట్టారు. కొంతమంది యాక్టర్స్ తో కలిసి సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారు. అయితే అన్ని రంగాల్లో సక్సెస్ అయినట్టు సినిమా రంగంలో మాత్రం టాటా విజయం సాధించలేరు. రతన్ టాటా ఒక్క సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. కానీ.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. అప్పటి నుంచి మరోసారి ఇండస్ట్రీ వైపు చూపలేదు.
ఇంతకీ రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏదని ఆలోచిస్తున్నారా..2004లో రిలీజ్ అయిన 'ఏత్‌బార్' సినిమాని బాలీవుడ్ నిర్మాత జితిన్ కుమార్‌తో కలిసి రతన్ టాటా ప్రొడ్యూస్ చేశారు. ఈసినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. 1996లో తెరకెక్కిన హాలీవుడ్ సినిమా 'ఫియర్' స్ఫూర్తితో విక్రమ్ భట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రతన్ టాటా నిర్మాతగా తీసిన సినిమాకు 9 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చయితే.. 8 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో కోటిన్నర నష్టపోయారు.
తీసిన ఒకే ఒక్క సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో.. ఏకంగా సినిమా ఇండస్ట్రీకే బై బై చెప్పారు రతన్ టాటా. అప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకే దూరంగా ఉన్నారు. సినిమాల జోలికి వెళ్లలేదు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత.. చాలా మంది నిర్మాతలు, దర్శకులు మంచి కథతో రతన్ టాటాను సంప్రదించినా.. తిరస్కరించారు. అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లోనూ పెట్టుబడులు పెట్టటం.. సినీ ఇండస్ట్రీ వ్యాపారం జోలికి కూడా వెళ్లలేదు రతన్ టాటా.. ఒక వేళ ఏత్ బార్ మూవీ హిట్ అయ్యింటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ టాటా గ్రూప్ ఎంట్రీ జరిగి ఉండేదనే ప్రచారం కూడా ఉంది.