రతన్ టాటా.. వ్యాపారవేత్తలు అన్నా.. డబ్బున్నోళ్లు అన్నా సమాజంలోని చాలా మంది ఈర్ష్యా, ద్వేషాలు, అసూయలు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి..లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం అధినేత రతన్ టాటా విషయంలో మాత్రం తరాలు మారినా తరగని నమ్మకం ఏర్పడింది. టాటా గ్రూప్స్ లో..రతన్ టాటా విషయంలో నాలుగు తరాలుగా మంచి అభిప్రాయం ఉంది.. నేటి కుర్రోళ్లకు కూడా ఈయన రోల్ మోడల్ అయ్యారు. అసలు రతన్ టాటా అంతలా.. నాలుగు తరాలకు దగ్గర కావటానికి ఈ 10 కారణాలే అంటున్నారు ఆర్థిక, సామాజిక నిపుణులు. అవేంటో చూద్దాం..
Also Read:-గుడ్‌బై మై డియర్ లైట్ హౌస్
- రతన్ టాటాపై ఎలా ఆర్థిక కుంభకోణాలు ఆరోపణలు లేవు.. స్కాంలు చేసిన చరిత్ర మచ్చుక కూడా లేదు.. పన్నులు ఎగ్గొట్టాడనే అపవాదు అస్సలు లేదు.
- లక్షల కోట్ల కంపెనీ సంపద.. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా.. ప్రతి చోట వినయంగానే ఉండేవారు.. పద్దతిగా ఉండేవారు.. యాటిట్యూట్ చూపించేవారు కాదు
- 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.. దేశ ఆర్థిక వ్యవస్థలో మేం భాగం..ప్రజలకు ఇంత చేస్తున్నామనే అహంకారం మచ్చుక కూడా కనిపించదు..అస్సలు అలాంటి అహంకారం ఏ సందర్భంలోనూ చూపించలేదు. అందరితో కలిసి మెలిసి ఉంటారు.. చిన్న ఉద్యోగులు, కార్మికులతోనూ సఖ్యతగా ఉంటారు.. అందరితో కలుపుగోలుగా మాట్లాడతారు.
- 86 యేళ్ల జీవితంలో ఎప్పుడు వివాదాలకు పోలేదు. అత్యుత్తమ వ్యాపార వేత్తగా..వేల కోట్లసంపద, అత్యున్నత శిఖరాలకు చేరుకున్నా వ్యక్తిగతంగా వ్యాపార పరంగా గానీ ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి.
- 100శాతం దేశం కోసం, దేశ ప్రజలకోసం శ్రమించడం. తన సంపాదనలో 60 శాతం వాటాను ట్రస్టులకు రాయడం. పేదల విద్య, వైద్యం, మౌళిక సదుపాయాల కోసం తన సంపాదనలో ఎక్కువ శాతం ఖర్చు చేశారు.
రతన్ టాటా ఇలా కోట్ చేసేవారు
- కట్టుకున్న బట్టలను చూసి ఎవరినీ అంచనా వేయకు, కించపరచొద్దు.. ఎందుకంటే బట్టలు ఆ వ్యక్తి టాలెంట్ ను నిర్ణయించవు
- స్నేహితుల్లో పేదరికాన్ని చూడొద్దు..ఎందుకంటే ఫ్రెండ్ షిఫ్ లో అంతరాలుండవు.
- ముసలి తల్లిదండ్రులను దూరం చేసుకోవద్దు.. ఎందుకు అంటే వారు లేకుండా మీరు లేరు కాబట్టి
- సింపుల్గా జీవించండి.. హంగు, ఆర్భాటం మీ విజయాన్ని నిర్ణయించదు