Ratan Tata dogs : రతన్ టాటాకు గోవా అంటే ప్రాణం : టాంగో, టిటో జబ్బు పడ్డాయని.. అవార్డ్ తీసుకోవడానికి లండన్‌కు రానన్నాడు

Ratan Tata dogs : రతన్ టాటాకు గోవా అంటే ప్రాణం : టాంగో, టిటో జబ్బు పడ్డాయని.. అవార్డ్ తీసుకోవడానికి లండన్‌కు రానన్నాడు

రతన్ టాటాకు కుక్కలంటే ప్రాణం.. ఆయన బిజినెస్ పనిమీద వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఉన్న వీధికుక్కల దయనీయ స్థితిని చూసి చాలా బాధపడేవారు. వాటిని ఇంటికి తీసుకొచ్చి.. కన్నబిడ్డలుగా పెంచుకునేవాడు టాటా. బాంబే హౌస్‌లో ఓ ఫ్లోర్ మొత్తం వీధికుక్కల పెంచడానికి కేటాయించారు. అందులో పదుల సంఖ్యలో వీధికుక్కలు పోషిస్తారారు. రతన్ టాటా మృతితో ఆ కుక్కలన్నీ అనాథలైయ్యాయి. 

రతన్ టాటాకు గోవా అంటే ప్రాణం

గోవా అనే పెట్ డాగ్ ఆయనకు చాలా ఇష్టం. రతన్ టాటా గోవాకు ఓ పని మీద పెళ్లినప్పుడు అక్కడ రోడ్డపై చూసిన కుక్కే గోవా.. ఆయన గోవా వెళ్లినప్పుడు దొరికింది. కాబట్టి.. దానికి ముద్దుగా గోవా అని పేరు పెట్టుకున్నాడు. బాంబే హౌస్‌లో ఎన్ని కుక్కలున్నా ఆయనకు గోవా అంటే ప్రాణం.. దానితో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడేవాడు.

టాంగో, టిటో జబ్బు పడ్డాయని అవార్డ్ తీసుకోవడానికి లండన్ పోలే..

2018లో ప్రిన్స్ చార్లెస్ నుంచి ప్రతిష్టాత్మకమైన జీవితకాల సాఫల్య పురస్కారానికి రతన్ టాటా ఎంపికయ్యారు. అవార్డ్ తీసుకోవాలని లండన్ నుంచి పిలుపు వచ్చింది. బకింగ్‌హామ్ ప్యాలెస్ లో బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఇంగ్లాండ్ రాణి చార్లెస్ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని రతన్ టాటా తీసుకోవాల్సిఉండే. అప్పుడు ఆయన పెంపుడు కుక్కలు టాంగో, టిటో లు అనారోగ్యం బారిన పడ్డాయి.. ఆ కారణంగా తాను రాలేనని చెప్పారు రతన్ టాటా. తన పెంపుడు జంతువు ఆరోగ్యానికి ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ విషయాన్ని ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన సుహెల్ సేథ్ మీడియాతో చెప్పారు.

ది స్మాల్ యానిమల్ హాస్పిటల్, (ముంబైలో మహాలక్ష్మీ)

జంతువుల పట్ల టాటాకు ఉన్న ప్రేమ అతని పెంపుడు జంతువులతోనే ఆగిపోలేదు. ఆయన కుక్కల్లో ఓ దానికి జబ్బు చేసి సరైన చికిత్స అందట్లేదని చాలా బాధపడ్డాడు. తర్వాత ఇలా జరగకూడదని రూ.165 కోట్లతో ఓ పెద్ద హాస్పిటల్ ను కట్టించారు. జూలై 2023లో టాటా ముంబైలోని మహాలక్ష్మి అనే పేరుతో ది స్మాల్ యానిమల్ హాస్పిటల్ ప్రారంభించారు. 98వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐసియులు, హెచ్‌డియులు, సిటి స్కాన్‌లు, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రేలు మరియు అల్ట్రాసౌండ్ మెషీన్‌లు వంటి అత్యాధునిక సాంకేతికత సేవలతో ఫ్రీగా పెంపుడు జంతువులకు ఇక్కడ ట్రీట్ మెంట్ చేస్తారు. ఈ హాస్పిటల్ ఉంది. ఇది జంతువులకు డెర్మటాలజీ, డెంటల్ కేర్, ఆప్తాల్మాలజీ మరియు ఇతర ప్రత్యేక చికిత్సలను అందిస్తుంది. టాటాకు ఈ ప్రాజెక్ట్ ప్రర్సనల్.

ALSO READ | రతన్ టాటా లాస్ట్ ట్వీట్ ఇదే.. ఏమన్నారంటే..