Ratan Tata In ICU: టాటా సన్స్‌ అధినేత రతన్‌ టాటా పరిస్థితి విషమం..?

Ratan Tata In ICU: టాటా సన్స్‌ అధినేత రతన్‌ టాటా పరిస్థితి విషమం..?

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ అధినేత రతన్ టాటాపరిస్థితి విషమంగా ఉందని, ముంబైలోని ఆసుపత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ బుధవారం (అక్టోబర్ 9, 2024)  రిపోర్ట్ చేసింది. సోమవారం కూడా ఈ తరహా వార్తలే వెలువడినప్పటికీ టాటా సంస్థ ఈ వార్తలను ఖండించింది.

 

86 ఏళ్ల వయసులో వయసు పైబడిన రీత్యా ఉండే అనారోగ్య సమస్యల కారణంగా రొటీన్ మెడికల్ చెకప్కు తాను వెళ్లినట్టుగా రతన్ టాటా తెలిపారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని సూచించారు. భారత్కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాల్లో రతన్ టాటా ముందు వరుసలో ఉంటారు. కేవలం వ్యాపారంలో లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో రతన్ టాటా మంచి పేరు తెచ్చుకున్నారు.

ALSO READ | ఈ రాష్ట్రం మీది.. మీ కోసమే మేమున్నాం: డిప్యూటి సీఎం భట్టి

దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎన్నో విద్యాసంస్థలను టాటా గ్రూప్ నెలకొల్పింది. సమాజ సేవలో టాటా సంస్థలు ఎనలేని కృషి చేస్తున్నాయి. టాటా ట్రస్ట్ కరోనా సమయంలో రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేసి పేదలకు సాయం చేసింది. దేశీ విమానయానంలో కీలకంగా ఉన్న ఎయిర్ ఇండియాను దశాబ్దాల తర్వాత టాటా సన్స్ 2021లో హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎయిర్ ఇండియా సంస్థకు మొత్తం రూ.61 వేల 562 కోట్ల అప్పులు ఉండడంతో ఎయిర్ ఇండియాలోని పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పలు ప్రైవేట్ కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఈ లిస్టులో టాటా సన్స్ ఎక్కువ బిడ్ దాఖలు చేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది.