బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) మొదలై ఒక వారం కాలేదు.. అప్పుడే కంటెస్టెంట్స్ మధ్య ఇష్టాలు, ప్రేమలు, రూమర్స్, అలకలు, బిజ్జగింపులు మొదలయ్యాయి. వారిలో ముందుగా గుర్తొచ్చే పేర్లు గౌతమ్ కృష్ణ(Goutham krishna)-శుభశ్రీ(Shubha shree), రతిక(Rathika)-పల్లవి ప్రశాంత్(Pallavi prashanth). ఈ రెండు జంటల్లో మరీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్-రతిక గురించే ఎక్కువగా టాక్ నడుస్తోంది. హౌస్ లోకి వచ్చిన మొదటిరోజే రతిక తనకు లేడీ లక్ అంటూ బ్యాండ్ ఇచ్చాడు ప్రశాంత్. ఆ తర్వాత కూడా ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపించారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్‌పై రతికకు ఉన్న ఫీలింగ్ ఏంటి? అనే సందేహంలో పడిపోయారు ఆడియన్స్.
Also Read : ఆన్ లైన్లో టెట్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
దీనికి సమాధానం సెప్టెంబర్ 8న ప్రసారమైన ఎపిసోడ్‌లో బయటపడింది. హౌస్ మేట్స్ అంతా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో.. సడన్ గా ప్రశాంత్‌ను బాబాయ్ అని పిలిచింది రతిక. ఆ పిలుపుకి ఒక్కసారిగా అవాక్కైన ప్రశాంత్ హార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎందుకు అలా వచ్చేశావ్, బాబాయ్ అని పిలిస్తే ఏంటి, ఎందుకు అంతలా ఫీలవుతున్నావు అంటూ ఇతర కంటెస్టెంట్స్ ప్రశాంత్ ను ప్రశ్నించారు. దానికి.. సందర్భం వచ్చినప్పుడు చెప్తా అంటూ మాట దాటేశాడు ప్రశాంత్.
కాసేపటికి రతిక కూడా ప్రశాంత్‌ను అడిగింది.. ఎందుకు అంత ఫీల్ అవుతున్నావ్. అసలు నీ ఫీలింగ్ ఏంటి? అని అడిగింది. అప్పుడు కూడా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయాడు ప్రశాంత్. దీంతో రంగంలోకి దిగిన శుభ శ్రీ.. రతిక, ప్రశాంత్ మధ్య ఏముందో క్లారిటీగా తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ప్రశాంత్ అంటే వ్యక్తిగతంగా నాకు ఇష్టమే.. కానీ అదంతా గేమ్ వరకు మాత్రమే. ఒక ఫ్రెండ్‌లాగా.. తనకు కూడా నిన్నటి ఇష్టమే కానీ.. అది నిజమా లేదా గేమ్ వరకేనా అనేది క్లారిటీ లేదు.. అడిగితే కూడా చెప్పడం లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చేసింది రతిక.
అయితే ఇదంతా చూస్తున్న ఆడియన్స్ మాత్రం కాస్త ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారు. వచ్చిన మూడు రోజులకే ప్రేమ, ఫీలింగ్స్, రిలేషన్స్ ఏంట్రా బాబు.. మతి గాని పోయిందా. ఉల్టా పుల్టా ఆంటీ ఈ సీజన్ అయినా కొత్తగా ఉంటుందనుకుంటే.. మాకీ ఖర్మ ఏంట్రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.