బిగ్ బాస్ కోసం రతికకు భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss seasn7)లో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టింది రతిక రోజ్(Rathika rose). తన అందం, గేమ్ ప్లాన్ తో అభిమానులను అలరించింది కూడా. అయితే అనుకోని విధంగా నాలుగో వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఎలిమినేషన్ ను ఊహించని రతిక స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎపిసోడ్ చూసినవాళ్ళకి అది క్లియర్ గా అర్థమైంది.     

అయితే నాలుగోవారంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయినప్పటికి బాగానే సంపాదించిందంట రతిక. ఆమెకు వారానికి రూ.2 లక్షలు 
చొప్పున రెమ్యూనరేషన్ ముట్టచెప్పారట బిగ్ బాస్ నిర్వాహకులు. దీంతో నాలుగు వారాలకు గాను రతిక రూ.8 లక్షలు అందుకుందని సమాచారం.

ALSO READ : వందే భారత్ స్లీపర్ రైళ్లు..విమానం లెక్క ఉంది కదా..

ఇక రతిక ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ప్రధాన కారణం పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడమే అని తెలుస్తోంది. షో మొదలైనప్పుడు ప్రశాంత్ తో బాగానే పులిహోర కలిపిన ఈ బ్యూటీ.. రాను రాను టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఇక నాలుగువారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ పై చేసిన కామెంట్స్ ను ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అంతేకాదు శివాజీ పై కూడా నెగిటీవ్ కామెంట్స్ చేయడం కూడా ఆమెకు వ్యతిరేకంగా మారాయి. ఈ రెండు కారణాల వల్లే ఆమె బయటకు వచ్చేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.