పంచాయత్ రాజ్ ఇంజనీర్ గా శంకర్ : రాథోడ్ శంకర్

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ గా రాథోడ్ శంకర్ నియమితులయ్యారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 27న పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. 

ఇప్పటి వరకు ఇన్​చార్జిగా కొనసాగిన ఎస్.భావన్నను ఆర్మూర్ డివిజన్ అధికారిగా నియమించారు. నూతనంగా నియమితులైన శంకర్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.