
పార్టీ మార్పుపై తనపై అసత్య కథనాలు వస్తున్నాయని తాను బీఆర్ఎస్ ను వీడేది లేదని బోథ్ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్టులో తన పేరు లేకపోవడంపై ఆయన స్పందించారు.
పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, చివరి శ్వాస వరకు సీఎం కేసీఆర్‌తో కలిసి నడుస్తానని చెప్పారు. తనపై అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు.
బోథ్‌లో అభ్యర్థి ఎవరైనా మళ్లీ ఎగిరేది గులాబీ జెండేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.