వయో వృద్ధులకు ఇంటివద్దకే రేషన్​

వయో వృద్ధులకు ఇంటివద్దకే రేషన్​
  • రాష్ట్ర ఫుడ్​ కమిషన్​ చైర్మన్​ తిరుమలరెడ్డి

వికారాబాద్ జిల్లా, వెలుగు :  జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద కొన్ని రేషన్ షాపులను ఎంపిక చేసుకొని 70 ఏండ్లు  దాటిన వయోవృద్ధులకు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేసేలా కృషి చేయాలని రాష్ట్ర ఫుడ్‌‌ కమిషన్‌‌ చైర్మన్‌‌ కె.తిరుమలరెడ్డి తెలిపారు.  గురువారం  వికారాబాద్ టౌన్​లోని ఎన్నేపల్లిలో రేషన్ షాపు, శివారెడ్డిపేటలోని ప్రైమరీ స్కూల్​ను, అంగన్వాడీ సెంటర్ ను తనిఖీ చేశారు. ఎన్నెపల్లి లోని రేషన్ షాపులో ఓటీపీ ద్వారా సరుకుల పంపిణీని పరిశీలించారు. కొంతమంది లబ్ధిదారులు కార్డు ఉండి కూడా రేషన్ తీసుకోవడంలేదని  చైర్మన్​ దృష్టికి తీసుకురాగా స్పందిస్తూ , రేషన్ షాపుల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించి పరిష్కరించాలని సూచించారు.  అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా చూడాలని ఆదేశించారు. ధారూర్ మండలంలోని కెరెళ్లలో సర్కార్​బడి ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కమిటీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, జిల్లా అడిషనల్​కలెక్టర్ మోతిలాల్, డీఆర్​డీవో  కృష్ణన్, డీడబ్ల్యూవో లలితా కుమారి,  డీసీఎస్​వో  రాజేశ్వర్, డీఎం సివిల్ సప్లై విమల, డీఎంఅండ్​హెచ్ వో జీవరాజు తదితరులు ఉన్నారు.