అర్హులందరికీ రేషన్‌‌ కార్డులిస్తాం.. రికమెండేషన్‌‌‌‌ అవసరం లేదు: పొంగులేటి

వరంగల్‍, వెలుగు : ఎలాంటి రికమెండేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం లేకుండానే అర్హులైన వారందరికీ రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఆదివారం ఆయన గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హనుమకొండ కలెక్టరేట్‍లో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్‍ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చిందన్నారు. కానీ తాము సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారిలో ఎవరైనా అనర్హులు ఉంటే గ్రామ సభల్లో చెప్పాలని, వారి అప్లికేషన్లను పక్కన పెడతామన్నారు. 

నాలుగు గోడల మధ్య కూర్చొని భూ భారతి చట్టాన్ని చేయలేదని, ప్రజల ముందుపెట్టి రెండు నెలల పాటు చర్చించాకే దానిని ఆమోద ముద్ర వేశామన్నారు. నాలుగు పథకాలను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి లక్ష్యమన్నారు. 

మంత్రి సీతక్క మాట్లాడుతూ పథకాలు ప్రారంభమయ్యే జనవరి 26 పేదోళ్ల పండుగ అన్నారు. రివ్యూలో ప్రభుత్వ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామచంద్రునాయక్‍, ఎంపీ బలరాంనాయక్‍, మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్‍.నాగరాజు, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు.