రేషన్​ బియ్యం ఇంకా రాలే

రేషన్​ బియ్యం ఇంకా రాలే

పాపన్నపేట, వెలుగు: 15వ తారీఖు వచ్చినా  రేషన్ షాపు లకు బియ్యం సరఫరా కాలేదు. దీంతో పండగ పూట పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. పాపన్నపేట, టేక్మాల్ మండలాలకు పాపన్నపేట గోదాం నుంచి రేషన్ బియ్యం సప్లై అవుతాయి. పాపన్నపేట మండలంలో 45 రేషన్ షాపులు ఉండగా ప్రతి నెలా సుమారు 246 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతాయి. టేక్మాల్ మండలంలో 29 షాపులు ఉండగా 164 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతాయి. 

కాగా పలు షాపులకు నిన్న మొన్నటి వరకు బియ్యం అందకపోగా మూడు  షాపులకు ఇంతవరకు బియ్యం రాలేదు. బియ్యం వచ్చిన చోట కూడా అన్ని చోట్ల పంపిణీ మొదలు కాలేదు. పాపన్నపేట మండలంలోని సీతానగరం, పోమ్ల తండాలకు, టేక్మాల్ మండలం తంపులూరు గ్రామాలకు ఇప్పటివరకు రేషన్ బియ్యం అందలేదు. బియ్యం లేక తప్పనిసరి పరిస్థితిలో  కొంతమంది దుకాణాలలో కిలో, రెండు కిలోల బియ్యం కొనాల్సిన 

పరిస్థితి నెలకొంది. 

స్టేజి వన్ నుంచి బియ్యం రాలేపాపన్నపేట గోదాంకు స్టేజి వన్ గోదాం నుంచి బియ్యం ఆలస్యంగా రావడం వల్ల నిన్నటి వరకు కొన్ని గ్రామాలకు అందజేశాం.  ప్రస్తుతం మావద్ద బియ్యం లేకపోవడం వల్ల మూడు గ్రామాలకు బియ్యం ఇవ్వలేకపోయాం. రాగానే సరఫరా చేస్తాం. నర్సింగరావు, గోదాం ఇన్​చార్జి, పాపన్నపేట