బొలేరో వాహనంలో రేషన్​బియ్యం పట్టివేత

బొలేరో వాహనంలో రేషన్​బియ్యం పట్టివేత

లింగంపేట, వెలుగు : బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న11.50 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని శుక్రవారం గాంధారి మండలం పోతంగల్​ కలాన్​స్టేజీ వద్ద పట్టుకున్నట్లు ఎస్​ఐ ఆంజనేయులు తెలిపారు. జిల్లాలోని బాన్సువాడ కు చెందిన​ అబ్దుల్​రహీం అనే వ్యక్తి టీఎస్​17యు 0993 నంబర్​గల బొలెరో వాహనంలో​ రేషన్​ బియ్యాన్ని తరలి న్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో తనిఖీలు చేపట్టి రేషన్​బియ్యాన్ని గుర్తించి వాహనాన్ని సీజ్​ చేశామని ఎస్ఐ తెలిపారు.    పట్టుకున్న బియ్యాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు అప్పగించామని, వాహనాన్ని సీజ్ చేసి  వాహన యజమాని అబ్దుల్​రహీంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. రేషన్​బియ్యాన్ని విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసినవారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు.