జోగిపేటలో రేషన్​ బియ్యం పట్టివేత

జోగిపేటలో రేషన్​ బియ్యం పట్టివేత

జోగిపేట, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. జోగిపేటలోని బసవేశ్వర చౌరస్తాలో అనుమానాస్పదంగా నిలిపిన లారీని పీఎస్​కు తరలించి సివిల్​ సప్లయ్​అధికారులకు అప్పగించినట్లు ఎస్​ఐ పాండు చెప్పారు. వారు పరిశీలించి అందులో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. 

వాటిని కూకట్​పల్లి నుంచి జోగిపేటకు తరలిస్తున్నట్లు తహసీల్దార్​ప్రభాకర్ వివరించారు. బియ్యం సీజ్​చేసి ​ఖేడ్​ సివిల్ సప్లయ్​గోదాంకు తరలించినట్లు చెప్పారు. లారీ డ్రైవర్​యూసుఫ్​ఖాన్​ను అదుపులోకి తీసుకొని  విచారిస్తున్నట్లు చెప్పారు.