దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న పూరీ రత్నభాండారాన్ని 46 ఏళ్ల తర్వాత జూలై14న ఓెన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత జూలై 14 మధ్యాహ్నం 1.28 గంటలకు ఒడిశా సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలోని 11 మంది సభ్యులు రత్న భాండాగారంలోకి ప్రవేశించారు. 4.5 ఫీట్ల పొడవు, 2.5 ఫీట్ల ఎత్తు, 2.5 ఫీట్ల వెడల్పుతో టేకుతో ప్రత్యేకంగా తయారుచేయించిన ఆరు భారీ చెక్కపెట్టెలను తీసుకొని కమిటీ సభ్యులు లోనికి ప్రవేశించారు. చెక్క పెట్టెల సహయంతో మొదటి రెండు గదుల్లో భాండాగారాన్ని బయటకు తీసుకొచ్చారు. లోపల ఉన్న రహస్య గదిని తెరిచేందుకు సమయం లేకపోవడంతో మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గది సీల్ వేశారు.
Also Read:48 గంటలు ఆస్పత్రి లిఫ్ట్ లో చిక్కుకున్న వ్యక్తి.. ఫోన్ లేదా.. ఎవరూ ఎందుకు చూడలేదు..?
ట్రెజరీ లోపలి, బయటి గదుల్లో ఉంచిన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను చెక్కపెట్టెలతో కూడిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌ను గుర్తించి సీసీ కెమెరాలతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రెండు గదుల నుంచి చెక్క పెట్టెల్లో బంగారు కడ్డీలు, నగలు,బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెక్క పెట్టెల్లో వేల కోట్ల సంపద ఉన్నట్లు సమాచారం. గదిలో సర్పాలు ఉన్నాయనే అనుమానంతో ముందుజాగ్రత్తగా స్నేక్ హెల్ప్‌లైన్, 40 మందితో కూడిన ఓడీఆర్ఏఎఫ్ బృందాలను ఆలయం బయట రెడీగా ఉంచారు అధికారులు.
పూరి రథయాత్ర సందర్భంగా భక్తులకు ఇబ్బంది కల్గకుండా భాండాగారం లెక్కింపును వాయిదా వేశారు. లోపల ఉన్న రహస్య గదిలోని భాండాగారం తలుపు తెరిచేందుకు మరో డేట్ ప్రకటిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో రహస్య గదిలో ఏమున్నాయనే దానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం సంపద లెక్కింపునకు 72 రోజులు పట్టే చాన్స్ఉన్నదని అధికారులు అంచనా వేశారు.