
కరీంనగర్ సిటీ, వెలుగు: ఫిబ్రవరి 2024లో రాష్ట్రస్థాయిలో తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో రత్నం స్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. అమూల్య దేవి(10వ), వర్షిణి(9వ), సాయి రమణ(8వ) విజేతలుగా నిలిచారు. వీరికి డీఈవో జనార్దన్ రావు బహుమతులు అందజేశారు. ఎంఈవో మధుసూదనా చారి, ఓయూ ప్రొఫెసర్ బీన్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు డాక్టర్ కె.వి. రావు, స్కూల్ చైర్మన్ రత్నయ్య, కరస్పాండెంట్ రమేశ్, ప్రిన్సిపాల్ ప్రవీణ్ పాల్గొన్నారు.