కేజీబీవీలో స్టూడెంట్లను కొరికిన ఎలుకలు

కేజీబీవీలో స్టూడెంట్లను కొరికిన ఎలుకలు
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఘటన

చండ్రుగొండ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీలో ఇద్దరు స్టూడెంట్లను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 11న రాత్రి నిద్రిస్తున్న సమయంలో టెన్త్​ స్టూడెంట్లు కాకటి స్వశ్చిత, కాకటి గోపికను కాళ్ల భాగంలో ఎలుకలు కొరికాయి. 

బుధవారం ఉదయం కేజీబీవీ స్పెషల్​ ఆఫీసర్  కవితకు ఈ విషయం తెలపడంతో, ఆమె ఎవరికీ చెప్పొద్దని స్థానిక పీహెచ్ సీలో చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్, ఎంఈవో సత్యనారాయణకు కంప్లైంట్  చేశారు. గురువారం కేజీబీవీని ఎంఈవో సందర్శించి ఘటన వివరాలు, స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

స్టూడెంట్లను పరామర్శించారు. హాస్టల్ లో ఎలుకలను అరికట్టడానికి ర్యాట్  గమ్  ప్యాడ్ లను వినియోగించాలని ఎస్ వోకు సూచించారు. ఇలాంటి ఘటన పునారావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.