నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో కల్లులో కట్లపాము వచ్చింది. డ్రమ్ముల్లో నింపి పెట్టిన కల్తీ కల్లులోకి పాము పిల్ల చేరింది. యథవిధిగా కల్లును సీసాల్లో నింపి గ్రామంలోని దుకాణాలకు సరఫరా చేశారు. జనవరి 16న రాత్రి కల్లు తాగుతుండగా ఒక్కసారిగా పాము నోటిలోకి రావడంతో కంగుతిన్నాడు కల్లు ప్రియుడు. ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా అవకయ్యారు.
ఇదేంటని యజమానిని ప్రశ్నించగా నేలచూపులు చూశాడు. కోపంతో రగిలిపోయిన గ్రామస్తులంతా దుకాణాన్ని కల్లు సీసాలను ధ్వంసం చేశారు. విషయాన్ని ఎక్సైజ్ పోలీసులకు తెలిపినా వారు స్పందించలేదు. దీంతో స్థానికంగా యువకులు ఆందోళన చేపట్టారు. కల్తీకల్లును అరికట్టాలని డిమాండ్ చేశారు.