ట్రెండింగ్ సాంగ్ : మార్మోగుతున్న జగన్ పాట

చంద్రబాబు వీడియో ప్రోమోలు… జగన్మోహన్ రెడ్డి పాటలు… ఇవే ఇపుడు ఆంధ్రాలో హాట్ టాపిక్స్. ఏపీలో ఏ నలుగురు కలిసినా ఇవే ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. బాబు ఇన్నాళ్లూ ఏం చేశాడు.. ప్రోమోల్లో ఇపుడు ఏం చెబుతున్నాడు…? వీడియో పాటల్లో జగన్ ఏం హామీ ఇస్తున్నాడు..? అనేదే అక్కడ డిస్కషన్ టాపిక్స్.

ఐతే.. వైఎస్ జగన్ పొలిటికల్ క్యాంపెయిన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాట జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది. జగన్ ప్రచారం హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసినా.. “రావాలి జగన్.. కావాలి జగన్..”  పాటే వినిపిస్తోంది.

రావాలి జగన్.. కావాలి జగన్  పాట యూట్యూబ్ లో 3 వారాల్లో కోటి వ్యూస్ దాటేసింది. ఇప్పటికే ఈ పాటకు దాదాపు 8 వేల కామెంట్లు వచ్చాయి. 10 మిలియన్ల వ్యూస్ దాటిన ఈ సాంగ్ ను.. 77వేల మంది లైక్ చేశారు.

రావాలి జగన్.. కావాలి జగన్ పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. మనో ఉత్సాహంగా పాడారు. శక్తికాంత్ కార్తీక్ ఈ పాటను కంపోజ్ చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర, రాష్ట్రవ్యాప్త పర్యటనలు… వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత వీడియోలతో ఈ పాటను రూపొందించారు. వైఎస్ఆర్ సీపీ అభిమానులను ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది.