రావణాసురుడిగా రవితేజ మెప్పించాడా?.. ట్విట్టర్ రివ్యూలు ఏమంటున్నాయి?

భారీ అంచనాల మధ్య విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్  రావణాసుర.  ఏప్రిల్ 7న సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తుండటంతో రావణాసురకు హైప్ క్రియేట్ అయ్యింది.  మరి ట్విట్టర్ రివ్యూలు ఏమంటున్నాయో తెలుసుకుందాం. 

రవితేజ ప్రతినాయకుడి పాత్రలో పూర్తిగా భిన్నమైన రోల్ లో కనిపించాడు. అయితే, రెగ్యులర్ రివేంజ్ డ్రామాగానే సినిమా సాగింది. ఫస్టాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. సెకండాఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక ఐదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ వారి పాత్రలకు అంతగా ప్రాధాన్యం దక్కలేదు.

కొన్ని చిన్న చిన్న విషయాలను పక్కన పెడితే ఓవర్ ఆల్ గా మంచి సినిమా. రవితేజ్ స్ర్కీన్ ప్రెజెన్స్, బీజీఎం బాగున్నాయి. రావణాసురుడి పాత్రలో హీరో కనిపించడం పెద్ద ప్లస్ పాయింట్. 

కొన్ని చిన్న చిన్న లాగ్ లు, రొటీన్ సీన్లను మినహా.. సినిమా చాలా బాగుంది. ఇదొక కామెడీ, థ్రిల్లర్ ప్యాకేజ్. ఫస్టాఫ్ పరవాలేదనిపిస్తుంది. సెకండాఫ్ లో పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్లు, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు బాగున్నాయి. రవితేజ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. సుశాంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. 

రవితేజ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు అనే రేంజ్ లో ఉంది. ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. 

సెకండ్ హాఫ్ లో మంచి ట్విస్టులు ఉన్నాయి. క్లైమాక్స్ లో వచ్చే బీజీఎం బాగుంది. లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహరాజా చూపించాడు. ఓవర్ ఆల్ గా మూవీ హిట్.

రావణాసుర ఫస్టాఫ్ డీసెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ లో హీరోది ప్యూర్ డామినేషన్. హీరోయిన్స్ రోల్ ఆకట్టుకోలేదు. రావణుడి యాక్టింగ్ ఫైర్.

ఆర్టీ టీమ్ వర్స్క్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను రూపొందించాడు. సుధీర్ వర్మ దర్శకుడు. దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అక్కినేని హీరో సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించాడు.