నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నపటికీ కొందరు గుట్టు చప్పుడు కాకుండా రేవ్ పార్టీలు, డ్రగ్స్ స్మగ్లింగ్ అంటూ కలకలం సృష్టిస్తున్నారు. కాగా తాజాగా హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిసరం ప్రాంతంలో ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తీ వివిరాల్లోకి స్థానిక నగరంలోని గచ్చిబౌలిలోని ఆలయి బలయి చౌరస్తాలో ఓ అపార్ట్మెంట్ లో బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే గచ్చిబౌలి సీఐ ఆంజనేయులు అపార్ట్మెంట్ పై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 12 మంది అబ్బాయిలు 6 మంది అమ్మాయిలు, సినిమా రంగానికి చెందిన జూనియర్ ఆర్టిస్టులు (ఇద్దరు అమ్మాయిలు) తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాకుండా ఈ రేవ్ పార్టీలో పలు మద్యం బాటిళ్లు, హుక్కా పాట్ వంటివి కూడా కూడా స్వాధీనం చేసుకున్నారు.
కాగా వరుణ్ అనే వ్యక్తి ధూల్ పెట్ నుండి 50 గ్రాములు గంజాయి కొన్నాడని ఈ క్రమంలో వరుణ్ తోపాటు ఆదిత్య, సాయి ప్రవీణ్ ముగ్గురికి పాజిటివ్ విచారణలో తేలింది. దీంతో సీఐ ఆంజనేయులు ఈ ముగ్గురిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.