T20 World Cup 2024: కోహ్లీ అలా చేయడంతో ద్రవిడ్ ఏడ్చాడు.. టీ20 వరల్డ్ కప్‌పై అశ్విన్

T20 World Cup 2024: కోహ్లీ అలా చేయడంతో ద్రవిడ్ ఏడ్చాడు.. టీ20 వరల్డ్ కప్‌పై అశ్విన్

17 ఏళ్ళ తర్వాత రోహిత్ సారధ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా అవతరించింది. శనివారం (జూన్ 29) బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ.. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడంతో టీమిండియా ప్లేయర్లతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ టోర్నీలో టీమిండియా వెటరన్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కిష్టమైన క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. 

‘‘టీమిండియా టీ20 ప్రపంచకప్‌ అంబరాల్లో మునిగిపోయింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ట్రోఫీని పట్టుకోవాల్సిందిగా ద్రవిడ్ ను కోరాడు. ట్రోఫీ అందుకున్న తర్వాత ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. సంతోషంతో గట్టిగా అరిచాడు. కప్ గట్టిగా పట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ టోర్నీ మొత్తంలో ఈ మూమెంట్ నాకు బాగా నచ్చింది. ఇదే నా బెస్ట్ మూమెంట్. ద్రవిడ్ కెప్టెన్సీలో 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ గ్రూప్ దశలోనే నిష్క్రమించినప్పుడు అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు". అని అశ్విన్ తెలిపాడు. 

టీమిండియా ది వాల్, మిస్టర్ డిపెండబుల్ గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ కు ఎన్నో సేవలను అందించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెస్టు, వన్డే ఫార్మాట్ లో బౌలర్లకు సవాలుగా నిలుస్తూ అడ్డుగోడల నిలబడేవాడు. అయితే ఎన్ని విజయాలు సాధించినా అతని ఖాతాలో ఐసీసీ ట్రోఫీ లేని వెలితి అలాగే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పటినుంచి ఐసీసీ ట్రోఫీ అతనికి అందని ద్రాక్షాలాగే మిగిలిపోయింది. అయితే ప్లేయర్ గా, కెప్టెన్ గా అందుకోలేని వరల్డ్ కప్ ను కోచ్ గా సాధించాడు.