డైరెక్టర్గా మారి హిట్టు కొట్టిన ‘కేజీఎఫ్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

డైరెక్టర్గా మారి హిట్టు కొట్టిన ‘కేజీఎఫ్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

సంగీత దర్శకుడిగా ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన రవి బస్రూర్.. దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి  ప్రధాన పాత్రలు పోషించారు. 

హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌‌‌‌పై  ఎన్ ఎస్ రాజ్‌‌కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ తెలుగు రైట్స్‌‌ను ఎంవీ రాధాకృష్ణ దక్కించుకున్నారు.

కంచి కామాక్షి కోల్‌‌కతా కాళీ  క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇచ్చేలా రవి బస్రూర్ ఈ చిత్రాన్ని రూపొందించారని, తెలుగు ఆడియెన్స్‌ కు కూడా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉందని  నిర్మాత ఎంవీ రాధాకృష్ణ అన్నారు.