MI vs LSG: బుమ్రా బౌలింగ్‌లో స్టన్నింగ్ సిక్సర్.. బిష్ణోయ్ బిల్డప్ మాములుగా లేదుగా

MI vs LSG: బుమ్రా బౌలింగ్‌లో స్టన్నింగ్ సిక్సర్.. బిష్ణోయ్ బిల్డప్ మాములుగా లేదుగా

వాంఖడే వేదికగా ఆదివారం(ఏప్రిల్ 27) ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ బౌలర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ప్రపంచ నెంబర్ వన్ పేసర్ బుమ్రా బౌలింగ్ లో సిక్స్ బాది ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సిక్సర్ తర్వాత బిష్ణోయ్ ఇచ్చిన బిల్డప్ అభిమానులకి కాస్త వినోదాన్ని పంచింది. ఇన్నింగ్స్ 18 ఓవర్ చివరి బంతిని బుమ్రా లెంగ్త్ బాల్‌ను విసిరాడు. బిష్ణోయ్ ఈ బంతిని చక్కని టైమింగ్ తో లాంగ్-ఆన్‌లో సిక్సర్ బాదాడు. 

సిక్స్ కొట్టిన తర్వాత బిష్ణోయ్ తన పిడికిలిని చూపిస్తూ కమాన్ అన్నాడు. అసలు విషయం ఏంటంటే.. అప్పటికే 8 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జయింట్స్ పరాజయం ఖాయమైపోయింది. ఈ దశలో డగౌట్ వైపు చూస్తూ బిష్ణోయ్ చేసిన ఓవరాక్షన్ నవ్వు తెప్పించింది. మ్యాచ్ గెలవడం సంగతి పక్కన పెడితే బుమ్రా బౌలింగ్ లో సిక్సర్ ఈ లక్నో స్పిన్నర్ కు మంచి కిక్ ఇచ్చింది. డగౌట్ లో ఉన్న రిషబ్ పంత్ తో పాటు మిగతా వారు తెగ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఈ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో ఆడడానికి లక్నో బాగా ఇబ్బంది పడింది. మార్కరం వికెట్ తీసి జట్టుకు శుభారంభం ఇచ్చిన ఈ ముంబై పేసర్.. 16 ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ ఓవర్ రెండో బంతికి మిల్లర్ ను ఔట్ చేసిన బుమ్రా.. చివరి రెండు బంతులకు అబ్దుల్ సమద్, ఆవేశ్ ఖాన్ లను బౌల్డ్ చేశాడు. ఓవరాల్ గా నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక బిష్ణోయ్ 14 బంతుల్లో 2 సిక్సర్లతో 13 పరుగులు చేసి తొమ్మిదో వికెట్ గా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జయింట్స్ పై 54 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఈ టోర్నీలో వరుసగా ఐదో విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ లో రికెల్ టన్ (32 బంతుల్లో 58: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (28 బంతుల్లో 54:4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో పాటు బౌలింగ్ లో బుమ్రా విజృంభించి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన  ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో161 పరుగులకు ఆలౌటైంది.