LSG vs GT: బిష్ణోయ్ వన్ హ్యాండెడ్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన విలియంసన్

LSG vs GT: బిష్ణోయ్ వన్ హ్యాండెడ్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన విలియంసన్

ఐపీఎల్ లో ఊహకందని క్యాచ్ లతో అభిమానులను షాక్ కు గురి చేయడం మాములే. ప్రతి సీజన్ లో గ్రేట్ క్యాచ్ లతో క్రికెట్ లవర్స్ కు వినోదాన్ని పంచుతూనే ఉంటారు. అలాంటి ఒక అద్భుత క్యాచ్ నిన్నటి (ఏప్రిల్ 7) మ్యాచ్ లో ఒకటి నమోదయింది. లక్నో సూపర్ జయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ వన్ హ్యాండెడ్ క్యాచ్ తో వావ్ అనిపించాడు. 

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 8 ఓవర్ స్పిన్నర్ బిష్ణోయ్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ లో రెండో బంతిని గుజరాత్ బ్యాటర్ విలియంసన్ గాల్లోకి స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. బౌలర్ కు దూరంగా వెళ్తున్న ఈ బంతిని బిష్ణోయ్ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ తీసుకున్నాడు. రెప్పపాటులో తీసుకున్న ఈ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రస్తుతం ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
 
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 163 రన్స్ చేసింది. 58 పరుగులు చేసిన స్టోయినీస్ టాప్ స్కోరర గా నిలిచాడు. 164 పరుగులు లక్ష్య ఛేదనలో గుజరాత్ 130 పరుగులకే పరిమితమైంది. యష్ ఠాకూర్ 5 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు.