నిర్మల్, వెలుగు: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవి రంజన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన నిర్మల్పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులు ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.