రవిశాస్త్రి, ఫరూఖ్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌కు లైఫ్‌‌‌‌ టైమ్ అవార్డులు

రవిశాస్త్రి, ఫరూఖ్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌కు లైఫ్‌‌‌‌ టైమ్ అవార్డులు

హైదరాబాద్, వెలుగు :  టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌, కోచ్ రవిశాస్త్రి, లెజెండరీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ ప్రతిష్టాత్మక  సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌‌‌‌మెంట్ అవార్డు గెలుచుకున్నారు. 2019–20 సీజన్‌‌‌‌కు గాను బీసీసీఐ ఈ ఇద్దరినీ తమ అత్యుత్తమ అవార్డుతో గౌరవించింది. 2022–23 సీజన్‌‌‌‌కు గాను శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్ బెస్ట్ మెన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా పాలీ ఉమ్రిగర్ అవార్డు నెగ్గాడు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని ఓ హోటల్‌‌‌‌లో కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో వీళ్లు పురస్కారాలు అందుకున్నారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ సందర్భం అని రవిశాస్త్రి చెప్పాడు. తనకు ఈ గౌరవాన్ని అందించిన బోర్డుకు థ్యాంక్స్‌‌‌‌ చెప్పాడు.

 శాస్త్రి 1983లో ఇండియా వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన టీమ్‌‌‌‌లో మెంబర్‌‌‌‌‌‌‌‌. కోచ్‌‌‌‌గా మారిన తర్వాత ఆస్ట్రేలియాలో ఇండియా వరుసగా రెండు టెస్టు సిరీస్‌‌‌‌లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, గతేడాది  సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసిన గిల్ 29 మ్యాచ్‌‌‌‌ల్లో ఐదు సెంచరీలతో సహా 1584  రన్స్ రాబట్టాడు.ఈ క్రమంలో వన్డేల్లో వేగంగా 2000 రన్స్ క్లబ్‌‌‌‌లో చేరాడు. విమెన్స్‌‌‌‌ టీమ్ ఆల్‌‌‌‌రౌండర్ దీప్తి శర్మ 2019–20, తో పాటు  2022–-23 సీజన్‌కు  ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కైవసం చేసుకుంది.

 కరోనా తర్వాత మొదటిసారిగా జరిగిన ఈ వేడుకలో గత నాలుగు సీజన్ల అవార్డులను బీసీసీఐ విన్నర్లకు అందజేసింది. ఈ వేడుకలో  బీసీసీఐ ప్రతినిధులు, ఇండియా మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ క్రికెటర్లతో పాటు తొలి టెస్టు కోసం హైదరాబాద్‌‌‌‌లో ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా పాల్గొన్నారు.  స్టేజ్‌పై గిటార్ వాయించిన జెమీమా రోడ్రిగ్స్‌‌తో కలిసి సునీల్ గావస్కర్ పాట పాడటం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.