![Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాప్ ఆటగాళ్లు ఎవరో చెప్పిన రవిశాస్త్రి, రికీ పాంటింగ్](https://static.v6velugu.com/uploads/2025/02/ravi-shastri-and-ricky-ponting-made-their-predictions-for-the-champions-trophy-2025_P6hR0ANSvl.jpg)
క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ టైటిల్ సిద్ధంగా ఉంది. 2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. మరో వారంలో జరగనున్న ఈ టోర్నీ తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు దిగ్గజ క్రికెటర్లు.. క్రికెట్ ఎక్స్ పర్ట్స్ ఇప్పటికే తమ ప్రిడిక్షన్ తెలిపారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరులు ఎవరు..అత్యధిక వికెట్ల వీరులు ఎవరు అనే తమ అభిప్రాయాలను తెలిపారు.
ALSO READ | Ranji Trophy: 15 ఏళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు దేశవాళీ పరుగుల వీరుడు రిటైర్మెంట్
ఐసీసీ రివ్యూ పాడ్‌కాస్ట్‌లో రవి శాస్త్రి మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో యువ భారత బ్యాటర్ యశస్వి జైశ్వాల్ మెరుస్తాడని.. అతడే టాప్ స్కోరర్ అని తెలిపాడు. ఇక బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ టాప్ వికెట్ టేకర్ గా నిలుస్తాడని తెలిపాడు. మిచెల్ స్టార్క్ కూడా ఈ రేస్ లో ఉంటాడని అన్నాడు. మరోవైపు, పాంటింగ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఎంచుకున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అతని వీరోచిత ప్రదర్శనను హైలైట్ చేశాడు. బౌలింగ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా అత్యధిక వికెట్లు తీస్తాడని చెప్పాడు.