టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కష్టకాలం నడుస్తుంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ లో ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా నిరాశపరిచారు. రోహిత్ ఆడిన ఐదు ఇన్నింగ్స్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. చెత్త ఫామ్ కారణంగా చివరి టెస్ట్ లో హిట్ మ్యాన్ కు చోటు దక్కలేదు. మరోవైపు కోహ్లీ ఒక సెంచరీ మినహా మిగిలిన ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు.
రోహిత్, కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆదుకోవాల్సిన వీరిద్దరూ ఘోరంగా విఫలమవుతూ జట్టుకు భారమవుతున్నారు. దీంతో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లీ, రోహిత్ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించారు. "కోహ్లీ, రోహిత్ గ్యాప్ ఉంటే వారు తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలి. వారు దేశవాళీ క్రికెట్ ఆడితే చూడాలని ఉంది. పేలవ ఫామ్ లో ఉన్న వీరిద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం". అని శాస్త్రి ఐసీసీ రివ్యూలో అన్నాడు.
ALSO READ : IND vs ENG: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిరాజ్, బుమ్రాలకు రెస్ట్.. ఆ ఇద్దరు పేసర్లకు ఛాన్స్
రోహిత్ శర్మ చివరిసారిగా 2016లో దేశవాళీ మ్యాచ్ ఆడగా, విరాట్ కోహ్లీ 2012 నుంచి దేశవాళీ క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 2024లో టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్ సగటు 25 కంటే తక్కువగా ఉంది. జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ ఉండడంతో రోహిత్, కోహ్లీ ఆడడం కష్టమే. 2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది.
Go back and play some domestic cricket': Ravi Shastri to 'out-of-form' Virat Kohli and Rohit Sharma pic.twitter.com/7Gbdgpu9op
— Rajesh Tweets (@Rajeshtweets24) January 8, 2025