రవితేజ 75వ సినిమా షూటింగ్ స్టార్ట్

రవితేజ 75వ సినిమా షూటింగ్ స్టార్ట్

రవితేజ  కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్‌‌‌‌‌‌‌‌కు స్పెషల్  క్రేజ్ ఉంటుంది.  ముఖ్యంగా ఆయన నటించిన కామెడీ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తిరిగి అలాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, ఆరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేశారట మేకర్స్.  రవితేజ నటిస్తున్న 75వ సినిమా ఇది.

 ‘ఆర్టీ 75’ వర్కింగ్ టైటిల్‌‌‌‌‌‌‌‌తో రూపొందిస్తున్నారు.  ఇందులో ఆయన  తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నాడట. శ్రీలీలను హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా ఫిక్స్ చేశారు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రంలోని రవితేజ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేసిన టీమ్.. సినిమాపై ఆసక్తిని పెంచింది.