![ఆగిపోయిన రవితేజ సినిమా! కారణం ఇదేనా?](https://static.v6velugu.com/uploads/2023/11/ravi-teja-and-gopichand-malineni-rt4gm-movie-has-been-shelved_HoA03fNqrj.jpg)
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో ఫామ్ లో ఉన్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తో మరో మూవీ (RT4 GM ) చేయడానికి రెడీ అయిన విషయం తెలిసేందే. వీరి కాంబో అంటే ఫ్యాన్స్ కు కిక్కేంచే వార్తా కావడంతో ఈమూవీ పై ఆసక్తి కలిగిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers)ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.
రీసెంట్ గానే..రవితేజ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసేశారు. కానీ తీరా సెట్స్ పైకి వెళ్తుందని అనుకునేలోపే (RT4 GM) సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ముఖ్యంగా సినిమాపై పెరిగిన బడ్జెట్..హీరో తీసుకునే రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.
సమాజంలో జరిగిన నిజ జీవితాల సంఘటనలతో తెరకెక్కుతున్న..ఈ మూవీకి సంబంధించి అన్ని లెక్కలు చూసుకుంటే రూ.120 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్కి హీరో రవితేజ దాదాపు రూ.25 కోట్ల మేరకు రెమ్యూనరేషన్ తీసుకోబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో రిస్క్ చేయకుండ ప్రాజెక్ట్ను పక్కన పెట్టాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
#RT4GM : Film Nagar reports indicate that producers feel the film's budget is off, prompting them to temporarily halt the project for a careful reassessment. #GopichandMalineni and #RaviTeja delivered hits like Don Seenu, Balupu and Krack.
— CHITRAMBHALARE.IN (@chitrambhalareI) November 22, 2023
Project on hold ?? pic.twitter.com/jfcsiqIk9z
రవితేజ కెరీర్లో అల్టిమేట్ హిట్గా నిలిచిన ధమాకా మూవీ తర్వాత..ఇంత వరకు ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అలా రవితేజతో సినిమా చేసిన ఏ ప్రొడ్యూసర్ కూడా లాభాలు కళ్ల చూడలేదు. కానీ భారీ హైప్స్ లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం వరకు అదలా ఉంచితే..రిలీజ్ అయిన తర్వాత లెక్కలే మారిపోతూ వస్తున్నాయి.
దీంతో సినిమా ఫ్లాప్ అయ్యాక..జిఎస్టీలు వెనక్కు ఇచ్చుకోవడం, ఎంతో కొంత తిరిగి వెనక్క కట్టడం..ఇలాంటివి అన్నీ కలిసి నిర్మాతలకు..బయ్యర్లకు భారీ నష్టాలే తెచ్చి పెడుతున్నాయి. ఇలా అని ఏ ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోవట్లేదు. కానీ, ఇపుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆలోచనలో పడినట్లు సమాచారం.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవగా గురువారం (నవంబర్ 23) నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. అయితేలేటెస్ట్ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి..RT4 GM విషయంలో ఏం జరుగుతుందో అని రవితేజ ఫ్యాన్స్ కంగారులో ఉన్నారు.
#RT4GM ?
— Ravi Teja (@RaviTeja_offl) October 25, 2023
My 3rd with @MythriOfficial ❤️
4th with @megopichand ?
It's been a fantastic journey with them and this time looking forward to an absolute blast ? pic.twitter.com/4i0xwgXGLz