Mr Bachchan Censor: రవితేజ-హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌’(Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది. ఇప్పటికే పాటలతో,టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మేకర్స్..ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ తో ఆసక్తి పెంచుతున్నారు. 

తాజాగా మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు/ఎ (U/A) సర్టిఫికెట్‌ను పొందింది. మొత్తం 2 గంటలు 38 నిమిషాల నిడివితో, ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో బచ్చన్ ఎంటర్ టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అలాగే జగ్గూభాయ్, రవితేజ మధ్య వచ్చే సీన్స్ థియేటర్స్ లో గూస్బంప్స్ పుట్టిస్తాయని, హీరోయిన్, హీరో మధ్య వచ్చే సీన్స్ అలరిస్తాయని సెన్సార్ నుంచి టాక్ ఉంది.సెన్సార్ టాక్ ను బట్టి చూసుకుంటే ఇటు రవితేజ, అటు హరీష్ శంకర్ హిట్ కొట్టబోతున్నారన్నమాట.ఈ నేపథ్యంలో రవితేజ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ కెమెరా బాధ్యతలు చేపట్టారు.రవితేజకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. 

'U/A' సర్టిఫికేట్: 

ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.