మిస్టర్ బచ్చన్ మూవీకి భారీ నష్టాలు: హీరో రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక నిర్ణయం!

మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ (Harish Shankar)లో ఆగస్ట్ 15న థియేటర్లలలో రిలీజైన మూవీ మిస్టర్ బచ్చన్(Mr.Bachchan). టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లో ర‌వితేజ కామెడీ టైమింగ్‌, ప్ర‌మోష‌న్స్‌లో భాగ్య‌శ్రీ బోర్సే గ్లామ‌ర్ కార‌ణంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై ముందు నుంచి మంచి బ‌జ్ ఉండడం వల్ల..కలెక్షన్స్ బాగానే వస్తాయనుకున్న..ఫ‌స్ట్ డేనే బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలాప‌డింది. దాని ఫలితం.. ఈ మూవీని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో..డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్, హీరో రవితేజ కీల‌క నిర్ణయం తీసుకున్న‌ట్లుగా తెలుస్తుంది. 

తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..మిస్టర్ బచ్చన్ సినిమాకు తాను తీసుకోవాల్సిన రెమ్యూనరేషనలో హీరో రవితేజ రూ.4కోట్లను తగ్గించుకున్నారనే విషయం బయటికి వచ్చింది. అలాగే, హీరోతో పాటుగా డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం తన రెమ్యూనరేషన్‍లో రూ.2కోట్లను నిర్మాతలకు తిరిగి ఇచ్చేయనున్నారట.ఈ సినిమాకు గాను హరీష్ శంకర్ రూ. 8 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసేసరికి ర‌వితేజ అభిమానుల‌తో పాటు అతని హరీష్ శంకర్ ఫాలోవర్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే..గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు ఫ్లాప్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు..తమ రెమ్యునరేషన్ రిటర్న్ చేసిన సందర్భాలున్నాయి. 

ALSO READ : Double iSmart Official OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్ డబుల్ ఇస్మార్ట్..

మిస్టర్ బచ్చన్ సినిమా సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించినట్లు సమాచారం. అయితే,ఈ సినిమా మొత్తంగా రూ.8కోట్లను కూడా దాటలేదని సమాచారం. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలనే ఈ చిత్రం మిగిల్చింది.