MASSJathara: శ్రీలీలతో రవితేజ మాస్ దావత్.. దీపావళికి మోత మోగిపోద్ది అంటూ ట్వీట్

MASSJathara: శ్రీలీలతో రవితేజ మాస్ దావత్.. దీపావళికి మోత మోగిపోద్ది అంటూ ట్వీట్

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) కొత్త సినిమాను షురూ చేశారు. ఆయన కెరీర్ లో 75వ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.

బుధవారం అక్టోబర్ 30న ఈ సినిమా టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘మాస్ జాతర.. మనదే ఇదంతా’ (MASSJathara) అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని టైటిల్​ పోస్టర్‌ ద్వారా వెల్లడించారు.

దీపావళికి మోత మోగిపోద్ది, మనదే ఇదంతా అంటూ రాసుకొచ్చారు. జాతర బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో డిజైన్ చేసిన రవితేజ లుక్‌‌‌‌ ఆకట్టుకుంటోంది. పోస్టర్​లో రవితేజ చేతిలో గంట పట్టుకుని రివాల్వర్​ ప్యాంటులో పెట్టుకుని స్మైలింగ్​ లుక్​లో మాస్​ నడుస్తూ కనిపించారు. 

‘రవితేజ, శ్రీలీల కాంబోలో గతంలో ధమాకా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో తెరపై ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యింది.

అలాగే.. రవితేజ కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్‌‌‌‌‌‌‌‌కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆయన నటించిన కామెడీ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తిరిగి అలాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అంతేకాకుండా శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ సామజవరగమన మూవీకి కథను అందించిన కథ రచయిత భాను భోగవరపు డైరెక్ట్ చేస్తుండటంతో మరింత స్పెషల్ ఉండనుంది. మరి ఈ సినిమా కూడా ధమాకా రేంజ్ లో భారీ విజయాన్ని సాధిస్తుందా చూడాలి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.