మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) 75వ సినిమా మాస్ జాతర (MASS Jathara). మనదే ఇదంతా క్యాప్షన్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. నేడు (జనవరి26న) రవితేజ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు.
మాస్ రాంపేజ్ గ్లింప్స్ పేరుతో విడుదలైన ఈ వీడియో అద్దిరిపోయింది. రవితేజ కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్‌కు ఈ స్పెషల్ గ్లింప్స్ పర్ఫెక్ట్ అసెట్గా నిలిచింది. రవితేజ స్వాగ్, ఎనర్జీని బాగా చూపించాడు డైరెక్టర్ భాను.
'మాస్.. మాస్ జాతర.. మాస్ మహారాజ్ కా మందుపాతర' అంటూ భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ హీటెక్కిస్తోంది. ఎప్పటిలాగే శ్రీలీల తన బ్యూటీతో ఇరగదీసినట్లు అర్ధమవుతుంది. ఇకపోతే రవితేజ నటించిన కామెడీ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తిరిగి అలాంటి కంప్లీట్ కామెడీ మాస్ ఎంటర్‌టైనర్‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.
దర్శకుడు భాను భోగవరపు:
యంగ్ హీరో శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ సామజవరగమన మూవీకి కథను అందించిన కథ రచయిత భాను భోగవరపు. తన మొదటి సినిమాను రవితేజను డైరెక్ట్ చేస్తుండటం మరింత స్పెషల్ గా ఉండనుంది. మరి ఈ సినిమా కూడా ధమాకా రేంజ్ లో భారీ విజయాన్ని సాధిస్తుందా చూడాలి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మే 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.