Mass Jathara: రవితేజ-శ్రీలీల మాస్ జాతర సాంగ్.. చక్రి ఏఐ వాయిస్తో ‘తు మేరా లవర్’

Mass Jathara: రవితేజ-శ్రీలీల మాస్ జాతర సాంగ్.. చక్రి ఏఐ వాయిస్తో ‘తు మేరా లవర్’

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర (MASS Jathara). మనదే ఇదంతా క్యాప్షన్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా మాస్ జాతర ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘తుమేరా లవ్వరో తుమేరా లవ్వరో’ అంటూ మాస్ ఊపుతో సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇడియట్ లోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి' బీట్ను ఈ పాటలో రీ క్రియేట్ చేశారు. ఇడియట్లో వచ్చే ఐకానిక్ స్టెప్పులను రవితేజ రీ క్రియేట్ చేస్తూ వేశారు. ఇవి మాస్ రాజా ఫ్యాన్స్కు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. శ్రీలీలతో రవితేజ చేసిన స్టెప్పులు, వీరిద్దరి హావభావాలు కిరాక్ అనిపిస్తున్నాయి.

ALSO READ : Samantha: సమానత్వం కనిపించదు.. నింద పడ్డ చోటే పరిష్కారం వెతకాలి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

ముఖ్యంగా ఈ పాటలో ఇడియట్ సంగీత దర్శకుడు చక్రికి నివాళి ఇస్తూ.. మేకర్స్ చేసిన ప్రయత్నం గొప్పగా ఉంది. నిర్మాతలు కృత్రిమ మేధస్సు(AI) ని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి క్రియేట్ చేశారు. ఈ పాట వింటుంటే చాలా ఏళ్ళ తర్వాత చక్రి రీ ఎంట్రీ ఇచ్చాడేమో అనే ఫీలింగ్ కలిగిస్తోంది. AIని ఇలా మంచి పని కోసం వాడిన మాస్ జాతర మేకర్స్ ఆలోచనను అభినందించాలి. 

ALSO READ : Daayra: పృథ్వీరాజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. క్రైమ్ డ్రామా జోనర్లో మూవీ అనౌన్స్

భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ గీతాన్ని భాస్కర భట్ల రాశారు. ఈ పాట ప్రోమోతోనే అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక ఈ పూర్తి సాంగ్ వింటుంటే.. నిజంగా థియేటర్లలోనే మాస్ జాతరేనని, మోత మోగిపోద్ది అంటూ రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ సినిమాలో రవితేజ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తుంటే, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.