రూల్స్ రంజన్ కు రవితేజ విషెస్

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ తెరకెక్కించిన ‘రూల్స్ రంజన్‌‌’ చిత్రం నుంచి నాలుగో పాటను రవితేజ విడుదల చేసి, టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్ లో మస్తీ మజా..’ అంటూ సాగిన ఈ పాటను అమ్రిష్ గణేష్ కంపోజ్ చేయగా, అద్నాన్ సమీ, పాయల్ దేవ్ పాడారు. కాసర్ల శ్యామ్, మేఘ్ ఉ వాట్ లిరిక్స్ రాశారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 6న  విడుదల కానుంది.