సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
జనవరి 13న సినిమా విడుదల కానుంది. మరో యాభై రోజుల్లో సినిమా విడుదల కానుందంటూ శుక్రవారం కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో ఇంటెన్స్ లుక్‌లో కూర్చున్నాడు రవితేజ. తన ఎదురుగా ఉన్న డెస్క్‌పై చాలా ఆయుధాలు కనిపిస్తున్నాయి. రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దావ్‌జాంద్ సంగీతం అందిస్తున్నాడు.