రవితేజ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్.. టైటిల్ కూడా ఫిక్స్ అయిందా..?

రవితేజ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్.. టైటిల్ కూడా  ఫిక్స్ అయిందా..?

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆమధ్య వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ అప్పటికే పలు సినిమాలు కమిట్ అవ్వడంతో వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా ఉంటున్నాడు. 

అయితే రవితేజ గతంలో నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2022 డిసెంబర్ నెలలో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఏకంగా రూ.110కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. అంతేకాదు హీరో రవితేజ కెరీర్ లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ ధమాకా సినిమాకి సీక్వెల్ కూడా తీయాలని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ సినిమాకి "డబుల్ ధమాకా" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా పూర్తవడంతో రవితేజ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్.

అయితే ప్రస్తుతం రవితేజ మాస్ మహారాజ్ 'మాస్ జతర' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి  'సామజవరగమన' మూవీ ఫేమ్ డైరెక్టర్ భాను భోగవరపు దదర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మస్తున్నాడు. ఇక డైరెక్టర్ త్రినాథరావు సందీప్ కిషన్ హీరోగా నటించిన "మజాకా" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ఈ మాస్ జాతర పూర్తయిన తర్వాత "డబుల్ ధమాకా" షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.