Raviteja Eagle OTT: ఇది ఆరంభం మాత్రమే.. OTTలో ఈగల్ సరికొత్త రికార్డ్

మాస్ మహారాజ రవితేజ(RaviTeja) హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్(Eagle). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహించాడు. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్స్ గా నటించారు. రవితేజ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు కార్తీక్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ తెరకెక్కించాడనే కామెంట్స్ వినిపించాయి.

 

నిజం చెప్పాలంటే ఈ సినిమాకు భారీ యాక్షన్ బ్లాక్స్ హైలెట్ గా మారాయి. కథలో కొత్తదనం లేనప్పటికీ, ప్రెజెంటేషన్ స్టైలీష్ గా ఉండటం, రవితేజ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండటంతో ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ గా రూ.50 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు మోస్తారు లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఈ మధ్యే ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ రాబడుతోంది. ఆ క్రమంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇండియా వైడ్ గా టాప్ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రానున్న రోజుల్లో ఈగల్ మూవీ ఓటీటీలో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈగల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు సీక్వెల్ గా ఈగల్ 2 రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.