
స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తోన్న మాస్ రాజా రవితేజ (Ravi Teja) లేటెస్ట్ మూవీ ఈగల్ (Eagle). రేపు (ఫిబ్రవరి 9న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది.మాస్ రాజా నుంచి వస్తోన్న స్పై థ్రిల్లర్ ఫిల్మ్ కావడమే కాకుండా..టీజర్ ట్రైలర్లో చూపించిన ఎలిమెంట్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. దాదాపు రూ. 80 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి..మాములు ధరల్లోనే టికెట్ల అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత కలెక్ట్ చేసిందనేది చూద్దాం.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో అదరగొట్టిందని చెప్పొచ్చు.వరల్డ్ వైడ్‌గా ఈగల్ థియేట్రికల్ రైట్స్ రూ.21 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం. ఇక ఏరియా వైడ్గా చూసుకుంటే..ఆంధ్రా ఏరియా మొత్తం కలిసి ఎనిమిదిన్నర కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు టాక్. నైజాంలో రూ.6కోట్లు, సీడెడ్‌లో రెండున్నర కోట్లకు ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: నిశ్చితార్థం చేసుకున్న జంటకు..ముందుగానే మోహన్‌బాబు ఆశీస్సులు
ఇక ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ గల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్లకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఓవర్‌సీస్‌లో రూ.2 కోట్లు, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో మరో రూ.2 కోట్ల వరకు థియేట్రికల్ హక్కుల ద్వారా ప్రొడ్యూసర్స్కి వచ్చినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్‌గా ఈగల్ మూవీకి 21 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మరి రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్ రేపు థియేటర్లలోకి రాబోతుంది.
ఇప్పటికే ఈగల్ మూవీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.రవితేజ కెరీర్ లో చాలా విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ మూవీతో అయిన హిట్ పడుతుందో..లేదో చూడాలి..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.