మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఈగల్ (Eagle). డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni) తెరకెక్కించిన ఈ సినిమాలో..అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran), కావ్య థాపర్(Kavya Thapar)హీరోయిన్స్గా నటించారు. సంక్రాంతికి రావల్సిన ఈగల్ మూవీ కాస్త ఆలస్యంగా నేడు (ఫిబ్రవరి 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ స్టైలీష్ యాక్షన్ స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈగల్ మూవీ రవితేజకు ఎలాంటి హిట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.
కథేంటీ:
జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ ప్రత్యేక కథనంతో ఈగల్ కథ స్టార్ట్ అవుతుంది. నళిని రాసిన కథనం చిన్నదే అయిన ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. నళిని రాసిన కథనం ఈగల్ పై కావడంతో ఓ పెద్ద నెట్ వర్క్ని టచ్ చేసేలా ఉంటుంది. ఈ ఈగల్ నెట్ వర్క్ని అంత నడిపేది సహదేవ్(రవితేజ). ఈగల్ బృందాన్ని ఛేదించడానికి మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ టీమ్, ఓ వైపు నక్సలైట్లు, మరోవైపు తీవ్రవాదులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా వెతికే పనిలో ఉంటారు. సహదేవ్ మాత్రం చిత్తూరు జిల్లాలోని తలకోన అడవుల్లో చేనేత రైతులకు అన్ని విధాలుగా సాయపడుతుంటాడు. అలాగే, సహదేవ్ తలకోన ప్రాంతంలోనే ఒక గిరిజన తెగ నివసించే ఏరియాలో కొండపై ఫాం హౌస్ కట్టుకుని ఒక పత్తి ఫ్యాక్టరీని రన్ చేస్తుంటాడు. అక్కడ ఉన్న రైతులు..వాళ్ళు పండించిన అరుదైన పత్తిని తీసుకొచ్చి సహదేవ్ నడిపే ఫ్యాక్టరీలో అమ్మి జీవనం సాగిస్తుంటారు. ఇక వారు పండించిన ప్రత్తి నుండి తయారైన వస్త్రాలకు దేశవిదేశాల్లో మంచి గుర్తింపు తీసుకొస్తాడు సహదేవ్.
అయితే..ఈ ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలో బాక్సైట్ గనులు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిసి..లోకల్ ఎమ్మెల్యేతో కలిసి ఒక బిజినెస్ మెన్..చుట్టూ ఉన్న తలకోన ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించాలని ప్లాన్ చేస్తారు. అపుడు వారి నుంచి రైతులను కాపాడడానికి సహదేవ్ ఏం చేస్తాడు ? మామూలు వ్యక్తిలా ఫ్యాక్టరీ రన్ చేసే సహదేవ్ వెనుక వేరే కథ ఉంటుంది. అతడికి ‘ఈగల్’ అనే మరో విధ్వంసమైన రూపం ఉంటుంది. ఈగల్ పై రీసెర్చ్ చేసే క్రమంలో నళిని కి చాలా భయంకర నిజాలు తెలుసుకుంటుంది. మరి ఆ కథేంటి? ఆ రూపమేంటి? సహదేవ్ని సీబీఐ, సెంట్రల్ ఫోర్స్‌తో పాటు నక్సలైట్లు, టెర్రరిస్టులు ఎందుకు వెతుకుతున్నారు? వాళ్లను సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు..అసలు సహదేవ్ తలకోన అడవికి ఎందుకొచ్చాడు? సహదేవ్ భార్య రచన (కావ్య థాపర్) అతడికి ఎలా దూరమైంది? ఈ విషయాలన్నీ థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే:
ఈగల్ మూవీ హైలీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవొచ్చు. గ్యాంగ్‌స్టర్ మూవీకి ఒక చిన్నపాటి సోషల్ మేసేజ్‌ను జోడించి తెరకెక్కించాడు డైరెక్టర్. నిర్ణయం నియంత నివారణ అంటూ..బలమైన ఆయుధం ఎవరి చేతుల్లో ఉండాలో ఈ కథతో చెప్పిన విధానం ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. రవితేజకు మాస్ ఆడియన్స్లో ఉన్న పల్స్ రేట్కి తగ్గట్టుగా డైరెక్టర్ తెరకెక్కించాడు. రవితేజ హీరోయిజం, ఎలివేషన్స్‌తో సినిమా ముందుకు సాగింది. డైరెక్టర్ ఈ సినిమాను ఫస్టాఫ్లో కథలు కథలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది కొత్తగా అనిపించిన..దాని వల్ల ఎలాంటి రిసల్ట్ కనిపించదు.ఎందుకంటే..కొన్నిసార్లు కథనం గందరగోళంగా అనిపించేలా ఉంది. జర్నలిస్ట్ నళీనీరావు పోషించిన పాత్ర ద్వారా.. హీరో క్యారెక్టర్‌లోని ఒక్కో కోణాన్ని రివీల్ చేయడం సినిమాలో ఆసక్తిని పెంచుతుంది. తలకోన ప్రాంతంలో చేనేత రైతులకు సాయం, పోలండ్‌లో నెట్‌వర్క్‌కి సంబంధించిన అక్రమ ఆయుధాల వ్యాపారం రెండు కంప్లీట్‌గా భిన్నమైన నేపథ్యాలు కలిగినవి. వాటిని లింక్ చేస్తూ ఈగల్ కథను డైరెక్టర్ అల్లుకున్న తీరు ఇంపాక్ట్ కలిగిస్తుంది.
ALSO READ :-శ్రీశైలం పులిహోర ప్రసాదంలో.. చికెన్ బొక్కలు
ఇక సెకండాఫ్లో పోలండ్‌లో జరిగే స్టోరీ, క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది.అమ్మవారి విగ్రహం నేపథ్యంలో యాక్షన్ ఘట్టం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. హీరో కథను చెప్పే క్రమంలో గతం-గరుడపురాణం..మృగసిర-మధ్యరాత్రి..పట్టపగలు-పద్ధతైన దాడి.. కంచె-కాపరి..అంటూ భేకరమైన పదబంధాలు వాడి ఆడియన్స్కు అట్ట్రాక్ట్ చేయడంలో ఈగల్ ఆకట్టుకుంది. కానీ, ఇలాంటి బలమైన పదాలు వస్తుంటే..పడ్డ సీన్స్ మాత్రం మామూలుగా అనిపిస్తాయి. బలమైన పదాలతో సినిమా రన్ అవుతుంటే..కథనం కూడా అదే స్థాయిలో ఉంటే సినిమా స్థాయి వేరే లెవల్ ఉండేది. అయినప్పటికీ..సినిమా స్క్రీన్ ప్లే, విజువల్ మేకింగ్తో ఆడియన్స్కు బోర్ కొట్టకుండా..డైరెక్టర్ కథనం నడిపించిన విధానం బాగుంది.
టెక్నిషియన్స్ :
ఈగల్ సినిమా చాలా రిచ్గా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఈసినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి న్యాయం జరిగింది.దర్శకుడు కార్తీక్ చెప్పిన కథను నమ్మి..ఎక్కడ రాజీ పడకుండా ఈ మూవీని తెరకెక్కించింది పీపుల్ మీడియా. సినిమాటోగ్రఫీ, విజువల్స్, లోకేషన్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. డైలాగ్స్ రాసిన మణిబాబు కరణం చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. డేవ్ జాండ్ అందించిన మ్యూజిక్ ఈగల్కి ప్రధాన బలం.కెమెరా, ఎడిటింగ్ విభాగాల్నీ చూసుకున్న..దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాను స్టైలిష్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు.