షూటింగ్లో గాయపడ్డ రవితేజ.. మోకాలికి 12 కుట్లు : నిర్మాత అభిషేక్​ అగర్వాల్

మాస్​ మహారాజా రవితేజ(Raviteja) సినిమా షూటింగ్​లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టైగర్​ నాగేశ్వర్​రావు(Tiger Nageswara Rao) సినిమా షూటింగ్​లో ఆయన మోకాలికి గాయమైనట్టుగా..ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే, సినిమా నుంచి బ్రేక్​ తీసుకుంటే నిర్మాత నష్టపోతాడని..రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయారట. రెస్ట్​ తీసుకోవాలని చెప్పినా రవితేజ వినలేదని, సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావానికి అది నిదర్శనమని చెప్పుకొచ్చారు. దోపిడీ సీన్‌ చిత్రీకరణలో భాగంగా ట్రైన్ మీది నుంచి లోపలికి దూకే షాట్‌లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డారు. మోకాలికి గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారని..సినిమాపై ఆయనకున్న అంకిత భావానికి ఇది నిదర్శనమని నిర్మాత తెలిపారు.

ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్‌ సనన్‌(Nupur Saonon) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌(Abhishek Agarwal Arts Byanar) పై అభిషేక్ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ వీస్సా డైలాగ్స్ అందిస్తున్నారు. 

ALSO READ : Cricket World Cup 2023: రికార్డ్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం: బాబర్ అజామ్ 

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్(gvprakash) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. టైగర్​ నాగేశ్వర్​రావు మూవీ దసరా బరిలో నిలువగా..బాలయ్య బాబు భగవంత్ కేసరి, విజయ్ దళపతి లియో మూవీస్ తో తలపడనుంది.