వరుస సినిమాలతో ఈ ఏడాది థియేటర్స్‌కు రాబోతు న్నాడు రవితేజ. ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటిస్తున్నాడు. నిన్న రవితేజ పుట్టినరోజు కావడంతో విషెస్ తెలియజేస్తూ ఆ సినిమాలకి సంబంధించిన కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడి’ సినిమా నుంచి ‘ఫుల్ కిక్’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ‘నీ లిప్ లోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్.. ఓ నిప్పులాగ నన్ను తాకి పెంచెను పల్స్’ అంటూ శ్రీమణి రాసిన ఈ పాటను.. రవితేజ, డింపుల్ జంటపై తీశారు. ఇక శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్‌లో కనిపిస్తున్నాడు రవితేజ. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధమాకా’ ఆల్రెడీ సెట్స్ పై ఉంది. సుధీర్ వర్మ తీస్తున్న ‘రావణాసుర’ టీమ్స్ కూడా పోస్టర్స్‌తో రవితేజకు బర్త్ డే విషెస్ అందించారు.